ఏసీబీ దాడులు.. ఇంట్లోనే రూ.20 లక్షల్ని తగలబెట్టిన త‌హ‌సీల్దార్‌

by Sumithra |
ఏసీబీ దాడులు.. ఇంట్లోనే రూ.20 లక్షల్ని తగలబెట్టిన త‌హ‌సీల్దార్‌
X

దిశ,వెబ్‌డెస్క్: రెవెన్యూలో దాగి ఉన్న అవినీతి తిమింగిలాలు, జలగల్ని ఏసీబీ వలేసి పట్టుకుంటోంది. ఎప్పటి నుంచో సాగుతున్న అవినీతి దందాకు చెక్ పెడుతోంది. అవినీతి పరులు అనుకొండల్లా మారిపోవడంతో ఏసీబీ రెవెన్యూ శాఖపైనే కన్నేసింది.

తాజాగా జైపూర్ లో రెవెన్యూ అవినీతి అధికారుల చేతివాటానికి అడ్డు అదుపు లేకపోవడంతో ఏసీబీ అధికారులు రెక్కీ నిర్వహించారు. జైపూర్ సిరోహి జిల్లాకు చెందిన చెందిన తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ ఓ వ్యక్తికి కాంట్రాక్ట్ ఇప్పించాడు. మధ్యవర్తిగా ఉన్న రెవెన్యూ ఇన్ స్పెక్టర్ పర్వత్ సింగ్‌ సదరు కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి నుంచి రూ. లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికారు. అయితే ఈ అవినీతిపై విచారణ చేపట్టిన ఏసీబీ అధికారులు తహసీల్దార్ కల్పేష్ కుమార్ జైన్ ఇంటి పై దాడులు జరిపారు. ఈ దాడులకంటే ముందు ఏసీబీ అధికారులు వస్తున్నారని సమాచారం అందుకున్న కల్పేష్ కుమార్ ఇంట్లో ఉన్న 20 లక్షల్ని ఇంటిలోపల తాళం వేసి వంటగదిలో గ్యాస్ పై తగలబెట్టాడు. అదే సమయంలో ఏసీబీ అధికారులు తహసీల్దార్ ఇంటి డోర్ ను బలవంతంగా ఓపెన్ చేసి లోపలికి వెళ్లి చూడగా.., జైన్ తగలబెట్టిన కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. దీంతో జైన్ ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు కాలిన నోట్లు కాకుండా విడిగా ఉన్న 1.5లక్షల్ని స్వాధీనం చేసుకున్నారు.



Next Story