- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షియోమి నుంచి మరో క్రేజీ ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే
షియోమి నుంచి కీలక ప్రకటన వచ్చేసింది. షియోమి నుంచి మరో క్రేజీ ఫోన్ రానుందట. Xiaomi 17 Ultra పేరుతో కొత్త ఫోన్

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్ లోకి రకరకాల ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సామాన్యులు కొనుగోలు చేసేలా కొన్ని ఫోన్స్ ఉంటే, మరికొన్ని ఖరీదైనవి లాంచ్ అవుతున్నాయి. ఇలాంటి తరుణంలోనే షియోమి నుంచి కీలక ప్రకటన వచ్చేసింది. షియోమి నుంచి మరో క్రేజీ ఫోన్ రానుందట. Xiaomi 17 Ultra పేరుతో కొత్త ఫోన్ తీసుకొస్తున్నారట. డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ సందర్భంగా Xiaomi 17 Ultra ఫోన్ లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే, ఈ ఫోన్ ఇండియాలో కాకుండా మొదట చైనా తీసుకురానున్నారు.
మరి కొత్తగా లాంచ్ కానున్న Xiaomi 17 Ultra ఫోన్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.9 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ Snapdragon 8 Elite Gen 5 SoC ఆధారంగా వర్క్ చేస్తుంది. 50MP + 50MP UW + 200MP 5xPeriscopeతో ప్రధాన కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా అందిస్తోంది కంపెనీ. Xiaomi 17 Ultra ఫోన్ 6800mAh బ్యాటరీ కలిగి ఉండనుంది. ఇక ఈ ఫోన్ కు 100W (Wired) + 80W (Wireless) ఛార్జర్స్ సపోర్ట్ చేయనున్నాయి. Android 16 వెర్షన్ ఆధారంగా ఈ ఫోన్ పని చేయనుంది. ఇండియాలో ఈ ఫోన్ జనవరి చివరలో లాంచ్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఒకవేళ ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయితే, లక్షకుపైనే ధర ఉంటుందని అంచనా వేస్తున్నారు.






