- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న Xiaomi 17 Pro Max.. ధర, స్పెసిఫికేషన్స్ ఇవే!
ప్రముఖ చైనీస్ మొబైల్ బ్రాండ్ Xiaomi మరో కొత్త ఫోన్ Xiaomi 17 Pro Maxను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయబోతుంది. ఇప్పటికే దీనిని చైనా మార్కెట్లో విడుదల చేసింది. Xiaomi 17 సిరీస్ లో 17 Pro Max అత్యాధునిక ఫీచర్లతో మరింత అప్డేట్ గా తయారు చేశారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ చైనీస్ మొబైల్ బ్రాండ్ Xiaomi మరో కొత్త ఫోన్ Xiaomi 17 Pro Maxను ఇండియన్ మార్కెట్ లో విడుదల చేయబోతుంది. ఇప్పటికే దీనిని చైనా మార్కెట్లో విడుదల చేసింది. Xiaomi 17 సిరీస్ లో 17 Pro Max అత్యాధునిక ఫీచర్లతో మరింత అప్డేట్ గా తయారు చేశారు. ఇందులో 6.9 అంగుళాల LTPO OLED డిస్ ప్లే ఉండగా ఫోన్ వెనక భాగంలో 2.9 అంగులాల సెకండరీ స్క్రీన్ ఉండటం దీని ప్రత్యేకత. ఈ డివైస్ స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ప్రాసెసర్ ను కలిగి ఉండటంతో యూజర్లకు సరికొత్త గేమింగ్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. వెనక భాగంలో ఉన్న డిస్ ప్లే మధ్యలో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండగా, ఇది 50 మెగాపిక్సల్ తో నిర్మించబడింది.
కెమెరాలో ప్రధాన సెన్సార్, అల్ట్రా వైడ్ లెన్స్ మరియు 5x ఆప్టికల్ జూమ్‌తో పెరిస్కోప్ టెలిఫోటోను కలిగి ఉన్నాయి. ఇందులో 7500 mAh బ్యాటరీ ఉండగా 100W వైర్డ్ మరియు 50W వైర్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో 7500 mAh ఉన్నప్పటికీ ఫోన్ బరువు మాత్రం 192 గ్రాముల బరువుతో కేవలం 8mm మందంతో లైట్ వెయిట్ తో ఉండటం దీని ప్రత్యేకత. నీళ్లలో పడినా పనిచేసేలా దీనిని వాటర్ రెసిస్టెంట్ గా తయారు చేశారు. చైనాలో ఈ డివైజ్ బ్లాక్, వైట్, గ్రీన్ కలర్స్ లో అందుబాటులోకి తీసుకువచ్చారు. అంతే కాకుండా ఇందులో ప్రస్తుతం 12GB + 512GB వర్షన్ ధర రూ. 74,700 నుండి ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాదే ఈ డివైజ్ ఇండియన్ మార్కెట్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.






