- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు !
ఒకటో తేదీ వచ్చిందంటే.. రూల్స్ అన్నీ మారిపోతాయి. బ్యాంకుల నుంచి మొదలుపెడితే పెట్రోల్ అలాగే గ్యాస్ ధరల వరకు.. ఇలా

దిశ, వెబ్ డెస్క్ : ఒకటో తేదీ వచ్చిందంటే.. రూల్స్ అన్నీ మారిపోతాయి. బ్యాంకుల నుంచి మొదలుపెడితే పెట్రోల్ అలాగే గ్యాస్ ధరల వరకు.. ఇలా ఎన్నో మార్పులు ఉంటాయి... అయితే తాజాగా జూన్ ఒకటో తేదీ వచ్చిన సంగతి తెలిసిందే. జూన్ 1వ తేదీ కూడా సరికొత్త విధానాన్ని తీసుకొస్తోంది. దీనివల్ల మొబైల్ యూజర్లకు.. ఎదురుదెబ్బ తగిలే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది.
జూన్ 1 అంటే నేటి నుంచి కొన్ని ఫోన్లలో వాట్సప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇవాల్టి నుంచి ఐఓఎస్ 15, ఆండ్రాయిడ్ 5.0 లేదా వాటికి ముందు ఉన్న వెర్షన్స్ కలిగిన ఫోన్ లలో వాట్సాప్ సేవలు నిలిచిపోతాయని తాజాగా ప్రకటన విడుదలైంది. ఈ వెర్షన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్స్ నిలిచిపోవడమే ఇందుకు కారణమని.. నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు వాట్సప్ నిలిచిపోయే ఫోన్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటి పేర్లను ఒకసారి పరిశీలిస్తే...శామ్సంగ్ గెలాక్సీ ఎస్4, శామ్సంగ్ గెలాక్సీ నోట్ 3, సోనీ జెడ్‌పీరియా జెడ్1, ఎల్‌జి జి2, హువావే అసెండ్ పి6, మోటో జి (1st version), మోటరోలా రేజర్ హెచ్‌డి, మోటో ఇ 2014, iPhone 5s మరికొన్ని కూడా ఉన్నాయి.






