అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన ‘Vivo Y28 5G’ స్మార్ట్‌ఫోన్

by Harish |

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఇండియాలో కొత్త మోడల్‌ను జనవరి 8న విడుదల చేసింది. దీని పేరు ‘Vivo Y28 5G’.

అదిరిపోయే ఫీచర్స్‌తో విడుదలైన ‘Vivo Y28 5G’ స్మార్ట్‌ఫోన్
X

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో ఇండియాలో కొత్త మోడల్‌ను జనవరి 8న విడుదల చేసింది. దీని పేరు ‘Vivo Y28 5G’. ఇది క్రిస్టల్ పర్పుల్, గ్లిట్టర్ ఆక్వా కలర్స్‌లో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.13,999. 6GB RAM + 128GB ధర రూ.15,499. 8GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 16,999. ఈ కామర్స్ సైట్లు అమోజాన్, ఫ్లిప్‌కార్ట్, కంపెనీ Vivo ఇండియా ఈ-స్టోర్, ఇంకా ఇతర రిటైల్ స్టోర్లలలో అందుబాటులో ఉంది. కొనుగోలు సమయంలో SBI, IDFC ఫస్ట్ బ్యాంక్ వంటి ఎంపిక చేసిన కార్డ్‌లపై రూ.1500 తగ్గింపు కూడా లభిస్తుంది.


Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

* 6.56-అంగుళాల HD+ (720x1,612 పిక్సెల్‌లు) డిస్‌ప్లే

* 90Hz రిఫ్రెష్ రేట్, 840 nits బ్రైట్‌నెస్

* ఆక్టా-కోర్ 7nm MediaTek డైమెన్సిటీ 6020 SoC ప్రాసెసర్

* Android 13-ఆధారిత Funtouch OS 13పై రన్ అవుతుంది.

* బ్యాక్ సైడ్ 50MP+2MP కెమెరాలు.

* ముందు సెల్ఫీల కోసం 8MP కెమెరా

* 15W ఫాస్ట్ చార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది.

* దమ్ము, ధూళి నుంచి రక్షణ కోసం IP54 రేటింగ్‌తో వచ్చింది.

* ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ సైడ్‌కు ఉంటుంది.

Next Story