- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
vivo X300 Pro: వీవో నుంచి క్రేజీ ఫోన్..6510mAh బ్యాటరీ, ధర ఎంతంటే?
వివో ఎక్స్ 300 ప్రో పేరుతో వచ్చిన ఈ ఫోన్ కు 200MP (Main) + 50MP (3X Periscope) + 50MP (UW) మెయిన్ కెమెరా

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సామాన్యులకు అందుబాటులో ఉండేలా కొన్ని ఫోన్లు లాంచ్ అవుతుంటే, మరికొన్ని ఫోన్లు ఖరీదైనవి కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి నేపథ్యంలో వివో నుంచి మరో సరికొత్త ఫోన్ వచ్చేసింది. వివో ఎక్స్ 300 ప్రో ( Vivo X300 series) పేరుతో కొత్త 5జీ మొబైల్ ఫోన్ ను లాంచ్ చేసింది కంపెనీ. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదలైంది. కొత్తగా లాంచ్ అయిన వివో ఎక్స్ 300 ప్రో ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.78 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉన్న ఈ ఫోన్ 9500 (3nm) SoC డైమెన్‌సిటీ కలిగి ఉంటుంది.
వివో ఎక్స్ 300 ప్రో పేరుతో వచ్చిన ఈ ఫోన్ కు 200MP (Main) + 50MP (3X Periscope) + 50MP (UW) మెయిన్ కెమెరా అందిస్తున్నారు. సెల్ఫీల కోసం 50MP అందిస్తోంది వీవో కంపెనీ. ఇక వివో ఎక్స్ 300 ప్రో ( Vivo X300 series) పేరుతో వచ్చిన ఈ కొత్త 5జీ మొబైల్ ఫోన్ కు 6510mAh బ్యాటరీ రానుంది. అలాగే, 90W వైర్డ్ ఛార్జర్, 40W వైర్ లెస్ ఛార్జెర్ ఈ ఫోన్ కు సపోర్ట్ చేయనుంది. Android 16, Origin OS 6 సిస్టంపై ఈ ఫోన్ ఆధార పడి పనిచేయనుంది. 16GB + 512GB సామర్థ్యం ఉన్న ఈ వివో ఎక్స్ 300 ప్రో ధర రూ. 1,09,999గా ఫిక్స్ చేశారు. ఈ కొత్త వివో ఫోన్ iPhone 17 Pro కు పోటీగా వచ్చిందని అంటున్నారు.






