- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ulefone RugKing: నీళ్లలో ముంచినా, ఇసుకలో పాతిపెట్టినా పనిచేసే బండలాంటి ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే!
స్మార్ట్ ఫోన్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. కిందపడినా, నీళ్లలో పడినా పాడైపోతాయి. ఇటీవలికాలంలో కొన్ని వాటర్ ప్రూఫ్ ఫోన్లు వచ్చినా వాటి ధర చాలా ఎక్కువ. అవి నీటిలో పడినా పనిచేస్తాయని కానీ నేలపై కాస్త గట్టిగా పడితే రిపేర్ షాపుకు వెళ్లాల్సిందే.

దిశ, వెబ్ డెస్క్: స్మార్ట్ ఫోన్స్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి. కిందపడినా, నీళ్లలో పడినా పాడైపోతాయి. ఇటీవలికాలంలో కొన్ని వాటర్ ప్రూఫ్ ఫోన్లు వచ్చినా వాటి ధర చాలా ఎక్కువ. అవి నీటిలో పడినా పనిచేస్తాయని కానీ నేలపై కాస్త గట్టిగా పడితే రిపేర్ షాపుకు వెళ్లాల్సిందే. కానీ ఇప్పుడు మార్కెట్ లోకి వచ్చిన Ulefone RugKing ఫోన్ మాత్రం ఎలా అయినా వాడేయచ్చు. ఇది నీళ్లలో పడినా, ఇసుకలో కొన్ని గంటలు పాతి పెట్టినా పనిచేస్తుంది. అంతే కాకుండా నేలకేసి కొట్టినా కూడా దీనికి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు అని కంపెనీ చెబుతోంది.
దీని మరో ప్రత్యేకత 126 dB సూపర్ లౌడ్ స్పీకర్‌ను కలిగి ఉండటం. దీంతో పాటు శక్తివంతమైన టార్చ్ లైట్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే Unisoc T7255 ఆక్టా కోర ప్రాసెసర్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఇందులో 8GB RAM+256GB ఇంటర్నల్ స్టోరేజీ లభిస్తుంది. అంతే కాకుండా ఈ ఫోన్ లో 50మెగాపికల్స్ రేర్ కెమెరా ఉంది. 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఇక ఫోన్ 5.99 డిస్ ప్లేను కలిగి ఉండగా 910 నిట్స్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది.
అదే విధంగా దీనిలో 9600mAh బ్యాటరీ ఉంది. డాక్ చార్జింగ్ కు సైతం ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇది సాధారణ స్మార్ట్ ఫోన్లకు దాదాపు రెండింతలుగా ఉంది. దీంతో రోజంతా ఈ ఫోన్ బ్యాకప్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు ఫోన్ లో ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ ప్యానల్ ధృడంగా ఉండటం వల్ల నేలకేసి కొట్టినా ఎలాంటి డ్యామేజ్ అవ్వదని కంపెనీ చెబుతోంది. ఇండియన్ కరెన్సీలో దీని ధర రూ.19,300 కాగా ప్రస్తుతానికి మన దేశంలో లాంచ్ చేయలేదు. కానీ అమెరికా, యూకే లాంటి దేశాల్లో మాత్రం అఫీషియల్ సైట్ లలో అందుబాటులో ఉంది. త్వరలోనే ఇండియాలోనూ దీనిని లాంచ్ చేయబోతున్నట్టు టెక్ దునియాలో వార్తలు వినిపిస్తున్నాయి.






