- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఆవిష్కరణ: వండటమే కాదు, రుచి కూడా చూసే రోబోట్! (వీడియో)
ఈ యంత్రాలు మునుపెన్నడూ లేనంత వేగంగా విషయాలు నేర్చుకుంటున్నాయి. Innovative robot can 'taste' food to prepare it exactly

దిశ, వెబ్‌డెస్క్ః కాలంతో పాటు మనుషుల ఆలోచనలు, అవసరాలు మారుతున్నాయి. తద్వారా, మిషీన్ల సహాయం అత్యంత ఆవశ్యకమయ్యింది కూడా. అందుకే, ఈ యంత్రాలు మునుపెన్నడూ లేనంత వేగంగా విషయాలు నేర్చుకుంటున్నాయి. అంతేకాదు, మనిషి స్థానాన్ని వేగవంతంగా భర్తీ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా అభివృద్ధి చేసిన రోబోట్ వంట వండటమే కాదు ఆహారాన్ని రుచి కూడా చూడగలిగేలా రూపొందించారు. అంటే, ఏదో ఉప్పు చూసి వదిలేయడం కాదు. ఇది మనిషి ఆహారాన్ని నమిలే వివిధ దశల్లో ఆ ఆహారం రుచి ఎలా ఉంటుందని కూడా గుర్తించే సామర్థ్యమున్న రోబోట్. ఈ రోబో చెఫ్‌ను రష్యన్ గణిత శాస్త్రజ్ఞుడు, కంప్యూటర్ శాస్త్రవేత్త మార్క్ ఒలీనిక్ తయారుచేయగా, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు రోబోట్‌కు ఆహారం వండేటప్పుడు 'రుచి' చూడగలిగేలా శిక్షణ ఇచ్చారు. ఇప్పటికే ఈ రోబో ఎగ్ ఆమ్లెట్లు వండడానికి శిక్షణ పొందింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ఫ్రంటీర్స్ రోబోటిక్స్ & AI జర్నల్‌లో దీనికి సంబంధించి వివరణాత్మకమైన పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు.






