ప్రపంచంలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానళ్లు ఇవే

by Yella Dhawani Reddy |

ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా (Social media) వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.

ప్రపంచంలో ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్లు ఉన్న యూట్యూబ్ ఛానళ్లు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత డిజిటల్ యుగంలో సోషల్ మీడియా (Social media) వినియోగం తారాస్థాయికి చేరింది. టెక్నాలజీ ప్రగతితో, ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ సులభంగా అందుబాటులోకి రావడంతో వినోదాన్ని అన్వేషించే మార్గాలు పూర్తిగా మారిపోయాయి. కాస్త ఖాళీ సమయం దొరికినా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అందరూ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌, యూట్యూబ్ షార్ట్స్‌, ఫేస్‌బుక్ వీడియోలతో కాలక్షేపం చేస్తున్నారు.

ఈ క్రమంలో YouTube అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడే వీడియో ప్లాట్‌ఫారంగా అవతరించింది. వివిధ రకాల కంటెంట్.. విద్యా వీడియోలు, వినోదం, సంగీతం, వంటల రెసిపీలు, గేమింగ్, వ్లాగింగ్, వార్తలు వంటి అన్నింటినీ ఒకే చోట అందించే ఈ ప్లాట్‌ఫారంపై కోట్లాది మంది వినియోగదారులు తమకు నచ్చిన విషయాలను ఎంచుకొని చూస్తున్నారు.

ఇక ఈ వేదికపై కేవలం వినోదం మాత్రమే కాదు, ఎంతో మంది తమ ప్రతిభను ప్రదర్శిస్తూ యూట్యూబర్లుగా మారిపోయారు. కొందరైతే యూట్యూబ్‌ ద్వారా కోట్లు సంపాదిస్తూ, వారి జీవితాలను మలిచారు.

ఈ నేపథ్యంలో 2025 జూలై నాటికి అత్యధిక సబ్‌స్క్రైబర్లు కలిగిన టాప్ YouTube ఛానళ్ల జాబితా ఇదే:

* MrBeast (అమెరికా)-411 మిలియన్లు

* T-Series (ఇండియా)- 298 2 మిలియన్లు

* Cocomelon - Nursery Rhymes (అమెరికా)

195 మిలియన్లు

* SET India (ఇండియా)- 185.12 మిలియన్లు

* Vlad and Niki (అమెరికా)-142 మిలియన్లు

* Kids Diana Show (అమెరికా)- 135.2 మిలియన్లు

* Like Nastya (అమెరికా)- 128 మిలియన్లు

* Stokes Twins (అమెరికా)- 128.2 మిలియన్లు

* Zee Music Company (ఇండియా)-114.20 మిలియన్లు

* PewDiePie (జపాన్/స్వీడన్)- 111.21 మిలియన్లు

Next Story