- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్వరలో భారత మార్కెట్‌లోకి Samsung Galaxy S26 Ultra.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే!
సామ్ సంగ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న Samsung Galaxy S26 Ultra త్వరలో భారత మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. ఇది దీని ముందు వర్షన్స్ సామ్ సంగ్ గెలాక్సీ S24, సామ్ సంగ్ గెలాక్సీ S25 కంటే చాలా అప్డేటెడ్ ఫీచర్స్ తో వస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: సామ్ సంగ్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న Samsung Galaxy S26 Ultra త్వరలో భారత మార్కెట్ లో లాంచ్ కాబోతుంది. ఇది దీని ముందు వర్షన్స్ సామ్ సంగ్ గెలాక్సీ S24, సామ్ సంగ్ గెలాక్సీ S25 కంటే చాలా అప్డేటెడ్ ఫీచర్స్ తో వస్తోంది. ఈ ఫోన్ ఇండియన్ మార్కెట్ లోకి వచ్చే ఏడాది జనవరిలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీని ధర భారత మార్కెట్ లో రూ.1,59,999 ఉండవచ్చని టెక్ నిపుణులు అంచానా వేస్తున్నారు. Samsung Galaxy S26 Ultra సరికొత్త డిజైన్ తో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తోంది.
ఇది గత సామ్ సంగ్ ఫోన్‌ల కంటే చాల స్లిమ్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 6.9 అంగులాల OLED డిస్ ప్లే ఉంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్‌తో పనిచేయనుంది. అంతే కాకుండా Qualcomm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్ ద్వారా శక్తివంతంగా పనిచేయనుంది. ఈ ఫోన్ 5500mAh బ్యాటరీతో 60W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. సామ్ సంగ్ గెలాక్సీ S26 కెమెరా మాదిరిగానే దీని సెటప్ ఉన్నప్పటికీ హ్యాండ్ సెట్ యొక్క 200MP ISOCELL 200MP సోనీ షూటర్ రానుంది. దీంతో ఈ కెమెరాతో మరింత క్లారిటీగా ఫోటోలు తీసుకోవచ్చు. ఇక మీరు కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటే జనవరి వరకు వేచి చూడాల్సిందే.






