చైనాలో దూసుకెళ్తున్న రోబో టాక్సీ! ఫ్యూచర్‌లో డ్రైవర్ జాబ్స్ ఉండవేమో?

by Disha Web Desk 14 |
చైనాలో దూసుకెళ్తున్న రోబో టాక్సీ!  ఫ్యూచర్‌లో డ్రైవర్ జాబ్స్ ఉండవేమో?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రోబో మనుషులే కాదు.. రోబో ట్యాక్సీలు కూడా వచ్చేశాయి. రోబో టాక్సీలు డ్రైవర్ అవసరం లేకుండా ప్రయాణికులు కోరుకున్న గమ్యస్థానానికి చేరుస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. యాప్ ఆధారంగా పనిచేసే రోబో టాక్సీలు చైనాలో దూసుకెళ్తున్నాయి. గతంలోనే రోబో ట్యాక్సీల పేరుతో ఈ సెల్ఫ్ డ్రైవింగ్ ట్యాక్సీలను బీజింగ్‌లో చైనా ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. ఇప్పుడు అవి కొన్ని రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కూడా రోబో టాక్సీలను కొన్ని దేశాలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయోగాలు చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే అమెరికా కూడా ఈ రోబో ట్యాక్సీలను గతంలోనే అందుబాటులోకి తెచ్చారు. అయితే డ్రైవర్ లేకపోవడంతో టాక్సీలను బుక్ చేసుకోని కొంత మంది దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. కాలిఫోర్నియాలో రోబో ట్యాక్సీలకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే రాత్రిపూట విధులు ముగించుకుని ఆలస్యంగా ఇంటికి వెళ్లే వారికి ఈ రోబో ట్యాక్సీలు ఉపయోగపడతాయని ప్రభుత్వం భావించింది. అయితే రోబో టాక్సీలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇక డ్రైవర్ జాబులు ఉండవేమోనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.



Next Story

Most Viewed