సూపర్ ఆఫర్.. Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల తగ్గింపు

by Disha Web Desk 17 |
సూపర్ ఆఫర్.. Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల తగ్గింపు
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ అసలు ధర రూ. 19,999 కానీ 15 శాతం తగ్గింపుతో 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 16,999 కే అందుబాటులో ఉంది. దీంతో పాటు ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లు, EMI లావాదేవీలపై అదనంగా క్యాష్‌బ్యాక్‌లు కూడా ఉన్నాయి. ICICI బ్యాంక్, SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసిన కొనుగోలు చేసినట్లయితే రూ. 2,000 తగ్గింపు లభిస్తోంది. దీంతో ఫోన్ రూ.14,999 తగ్గుతుంది. ఇంకా Redmi కంపెనీ నుంచి Xiaomi ఫోన్‌లకు 2,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తుంది. దీనిని కూడా ఉపయోగించినట్లయితే ఫోన్ రూ. 12,999 లకే చేతికి వస్తుంది.




Redmi Note 12 5G స్మార్ట్ ఫోన్ 6.67-అంగుళాల పూర్తి-HD (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లే, 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. Android 12-ఆధారిత MIUI 13పై రన్ అవుతుంది. స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 4 Gen 1 SoC ప్రాసెసర్ ద్వారా రన్ అవుతుంది. ఫోన్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ,13-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఇది 33W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని కలిగి ఉంది.


Next Story