- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రియల్‌మీ నుంచి క్రేజ్ ఫోన్..7000mAh బ్యాటరీ..ధర ఎంతంటే
Realme GT 8 Pro పేరుతో ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ చేసింది కంపెనీ. 6.79 అంగుళాల డిస్ప్లే

దిశ, వెబ్ డెస్క్: భారత మార్కెట్ లో రియల్ మీ ( Realme) ఫోన్లకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా మార్కెట్లోకి మరో సరికొత్త ఫోన్ తో వచ్చేసింది రియల్ మీ. Realme GT 8 Pro పేరుతో ఈ మొబైల్ ఇండియాలో లాంచ్ చేసింది కంపెనీ. 6.79 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్, 7000 mah బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
ఆండ్రాయిడ్ 16 వెర్షన్ ఆధారంగా ఈ మొబైల్ వర్క్ చేయనుంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా, 50 ఎంపీ అల్ట్రా వైడ్, 200 ఎంపీ టెలిఫోటో కెమెరాతో ట్రిపుల్ రేర్ కెమెరా యూనిట్ ఈ మొబైల్ కు వస్తుంది. సెల్ఫీల కోసం 32 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. ఈ ఫోన్ కు 120w వైర్డ్, 50W (Wireless) ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తాయి. 12GB + 256GB వేరియంట్ మొబైల్ ధర Rs. 72,999గా ఫిక్స్ చేశారు. 16GB + 512GB వేరియంట్ ధర Rs. 78,999గా ఫైనల్ చేశారు.






