ఏసీల‌పై రూ.4500 వ‌ర‌కు త‌గ్గింపు...పూర్తి వివ‌రాలు ఇవే !

by velandi.Saikiran |

ఏసీలు, ఇతర ఎలక్ట్రిక్ వ‌స్తువులు కొనుగోలు చేసే వారికి శుభ‌వార్త. రేప‌టి నుంచే కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి రానున్నాయి

ఏసీల‌పై రూ.4500 వ‌ర‌కు త‌గ్గింపు...పూర్తి వివ‌రాలు ఇవే !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఏసీలు, ఇతర ఎలక్ట్రిక్ వ‌స్తువులు కొనుగోలు చేసే వారికి శుభ‌వార్త. రేప‌టి నుంచే కొత్త జీఎస్టీ రేట్లు అమలులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీలు, డిష్ వాషర్లు, టీవీలు కొనాలనుకునే వారికి పండగ రాయితీలతో పాటు జీఎస్టీ తగ్గింపు పెద్ద ఊరట కలిగిస్తోంది. ఏసీల మీద ఏకంగా సగటున 4,500 వరకు ధరలు తగ్గనున్నాయి. ఎల్జి 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధర ఏకంగా 3600 తగ్గుతోందట. డైకిన్ 1-3 స్టార్ ఏసీ ధర... దాదాపు 4700 రూపాయల వరకు తగ్గే ఛాన్సులు ఉన్నాయని తెలుస్తోంది.

గోద్రెజ్, లాయిడ్, సాంసంగ్ లాంటి కంపెనీలు కూడా తమ ఏసీల ధరలను తగ్గిస్తున్నాయి. అటు డిష్ వాషర్ల పైన 8 వేల రూపాయల వరకు ధర తగ్గుతుంది. టీవీల పైన 5 వేల రూపాయల వరకు భారీ మొత్తంలో ధరలు తగ్గుతున్నాయి. ప్రముఖ సంస్థలు గోద్రెజ్ అప్లయేన్సెస్, వోల్టాస్, డైకిన్, పానాసోనిక్, హైయర్ తదితర సంస్థలు ఇప్పటికే కొత్త ధరలను ప్రకటించాయి. దీంతో జిఎస్టి ఎత్తివేయడంతో సామాన్య మానవులు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

Next Story