- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
POCO F8 Pro: 6210mAh బ్యాటరీతో సరికొత్త ఫోన్..ధర ఎంతంటే ?
పోకో F8 ప్రో ( POCO F8 Pro ) పేరుతో కొత్త ఫోన్ తీసుకువచ్చింది కంపెనీ. అయితే ఈ మొబైల్ ఇంకా మన ఇం

దిశ, వెబ్ డెస్క్: మార్కెట్లోకి రకరకాల మొబైల్స్ వచ్చేస్తున్నాయి. కొన్ని మొబైల్స్ తక్కువ ధరలో లాంచ్ అవుతుంటే, మరికొన్ని మంచి ధరకు వస్తున్నాయి. ఎలాంటి మొబైల్ మార్కెట్లో లాంచ్ అయిన జనాలు ఇట్టే కొనుగోలు చేస్తున్నారు. ఏమాత్రం ఆలోచించడం లేదు. కొత్త కొత్త ఫీచర్స్ తో మొబైల్స్ వస్తున్న నేపథ్యంలో, జనాలు కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోకో కంపెనీ నుంచి మరో అదిరిపోయే మొబైల్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.
పోకో F8 ప్రో ( POCO F8 Pro ) పేరుతో కొత్త ఫోన్ తీసుకువచ్చింది కంపెనీ. అయితే ఈ మొబైల్ ఇంకా మన ఇండియాలో లాంచ్ కాలేదు కానీ, చైనా లాంటి దేశంలో రిలీజ్ చేశారు. మన ఇండియాలో త్వరలోనే ఈ మొబైల్ లాంచ్ కానుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం జనవరి మధ్యలో ఈ మొబైల్ లాంచ్ అయ్యే ఛాన్స్ ఉంది. కొత్తగా రిలీజ్ అయిన ఈ POCO F8 Pro మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం. 6.59 అంగుళాల డిస్క్ ప్లే కలిగి ఉన్న POCO F8 Pro మొబైల్ 6210mAh బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంది.
అంతేకాదు 50MP (OIS) + 8MP UW + 50MP (2.5x Telephoto) ప్రధాన కెమెరాతో ఈ ఫోన్ తీసుకువచ్చారు. సెల్ఫీల కోసం 20MP కెమెరా అందిస్తున్నారు. POCO F8 Pro మొబైల్ కు 100W వైర్డ్ , 22.5W రివర్స్ వైర్డ్ ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేయనుంది. Android 16 వెర్షన్ పై ఆధారపడి పని చేయనుంది. 12GB RAM +256GB వేరియంట్ POCO F8 Pro మొబైల్ ధర రూ. 51,000 ( $579) గా ఉంది. 12GB RAM+512GB వేరియంట్ ధర రూ. 56,100గా ($629) ఫిక్స్ చేశారు. అయితే, ఈ పోకో F8 ప్రో ( POCO F8 Pro ) ఇండియాలో జనవరిలో లాంచ్ అయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.






