Oppo Find X9s: 7,050mAh బ్యాట‌రీతో అదిరిపోయే ఒప్పో ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే

by velandi.Saikiran |

Oppo Find X9s పేరుతో రెండు మోడ‌ల్ ఫోన్స్ మ‌రో నాలుగు రోజుల్లో రిలీజ్ కానున్నాయి.

Oppo Find X9s: 7,050mAh బ్యాట‌రీతో అదిరిపోయే ఒప్పో ఫోన్‌..ధ‌ర‌, ఫీచ‌ర్స్ ఇవే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: ఇండియన్ మార్కెట్లోకి ఒప్పో మంచి మరో ఫోన్ రాబోతోంది. ఒప్పో ఫైండ్ X9S ( Oppo Find X9s) పేరుతో కొత్త ఫోన్ రాబోతోంది. ఇందులో ఒప్పో ఫైండ్ X9S ఆల్ట్రా మోడల్ కూడా లాంచ్ కానున్నట్లు అధికారిక ప్రకటన చేసింది కంపెనీ. ఏప్రిల్ 21వ తేదీన ఈ రెండు ఫోన్లను మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఫ్లిప్ కార్ట్, ఒప్పో స్టోర్లలో ఈ మొబైల్స్ అందుబాటులో ఉంటాయి.

Oppo Find X9s మొబైల్ ఫీచ‌ర్స్‌

మరి ఈ రెండు కొత్త మొబైల్స్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే.. ఒప్పో ఫైండ్ X9S మొబైల్ 6.59 ఇంచుల డిస్ ప్లే తో లాంచ్ కాబోతోంది. బ్యాటరీ సామర్థ్యం 7025 mah ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. 100w ఛార్జర్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇందులో 50 ఎంపీతో ట్రిపుల్ కెమెరా రానునంది. పీచ్, లీలాక్, గ్రే, పింక్, పర్పల్ కలర్స్ లో ఈ మొబైల్ లాంచ్ కాబోతోంది. అటు ఒప్పో ఫైండ్ X9S ఆల్ట్రా మొబైల్ 6.78 అంగుళాల డిస్ ప్లే తో రాబోతోంది. ఇందులో 200 ఎంపీ మెయిన్ కెమెరా అందిస్తున్నారు. ఇందులో 7050 mah బ్యాట‌రీతో ఈ ఫోన్ రానుంది. Oppo Find X9s ఈ ఫోన్ రూ.59,990 నుంచి 70,000 మ‌ధ్య ఉండ‌నుంది. Oppo Find X9s Ultra రూ. 1,49,999తో రానుంద‌ని అంటున్నారు.

Next Story