- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OPPO Find X9: ఒప్పో కొత్త ఫోన్లు వచ్చేశాయి..ఫీచర్స్, ధర వివరాలు ఇవే
ఒప్పో, Find X9 సిరీస్ లో కొత్తగా రెండు ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. OPPO Find X9, OPPO Find X9 Pro 5G పేరుతో

దిశ, వెబ్ డెస్క్: ఇండియాలో బాగా పాపులారిటీ సంపాదించిన ఒప్పో, Find X9 సిరీస్ లో కొత్తగా రెండు ఫోన్లను ఇండియాలో లాంచ్ చేసింది. OPPO Find X9, OPPO Find X9 Pro 5G పేరుతో ఈ ఫోన్లు తీసుకువచ్చింది. ఈ ఫోన్లు ఇప్పటికే చైనాలో లాంచ్ కాగా తాజాగా మన ఇండియాలోకి కూడా ఎంట్రీ ఇచ్చాయి. ఇందులో Find X9 సిరీస్ మొబైల్స్ 6.59 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటాయి. 7025 mah బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నాయి.
50 ఎంపీ ప్రైమరీ అలాగే 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా అందిస్తున్నారు. OPPO Find X9 Pro 5G మొబైల్ విషయానికి వస్తే.. ఇది 6.78 అంగుళాల డిస్ప్లే కలిగి ఉంటుంది. మెయిన్ కెమెరా 50 mp ఉండగా సెల్ఫీల కోసం కూడా 50 mp అందిస్తున్నారు. 7500 బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. 80W (Wired) ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. OPPO Find X9 మొబైల్ 12GB + 256GB మోడల్ ధక Rs 74,999గా ఫిక్స్ చేశారు అలాగే, OPPO Find X9 Pro ఫోన్ 16GB + 512GB మోడల్ ధర Rs 1,09,999గా ఫైనల్ చేశారు.






