- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఒప్పో నుంచి మరో రెండు కొత్త ఫోన్లు..ధర, ఫీచర్స్ ఇవే
ఒప్పో నుంచి మరో రెండు కొత్త ఫోన్లు లాంఛ్ అయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్: చైనాకు సంబంధించిన ఒప్పో మొబైల్స్ కు ఇండియాలో మంచి గిరాకీ ఉంటుంది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ కొనుగోలు చేసేలా మిడ్ రేంజ్ మొబైల్స్ ఈ కంపెనీ నుంచి వస్తాయి. అందుకే జనాల్లో ఆదరణ ఎక్కువ సంపాదించుకుంది ఒప్పో. అయితే అలాంటి ఒప్పో నుంచి తాజాగా రెండు స్మార్ట్ ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఒప్పో ఫైండ్ X9s ( OPPO Find X9s ), ఒప్పో ఫైండ్ X9 అల్ట్రా ( OPPO Find X9 Ultra) పేరుతో రిలీజ్ అయ్యాయి. X9 ఆల్ట్రా ప్రీమియం మోడల్ గా ఈ ఫోన్స్ తీసుకువచ్చారు. ఇవాళే ఇండియాలో ఈ ఫోన్లు రిలీజ్ అయ్యాయి.
6.82 అంగుళాల డిస్ ప్లేతో వచ్చిన OPPO Find X9 Ultra ఫోన్ SD 8 Elite Gen 5 కలిగి ఉంటుంది. 200MP OIS + 50MP UW + 200MP TP OIS + 50MP UTP + 3.2MP MC ప్రధాన కెమెరా రానుండగా, సెల్ఫీల కోసం 50MP ఫ్రంట్ కెమెరా ఇస్తున్నారు. 7050mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తున్న ఈ ఫోన్ కు 100W wired, 50W wireless ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. ఇక ఈ ఫోన్ ధర రూ.1,69,999గా ఫిక్స్ చేశారు. 6.59 అంగుళాల డిస్ ప్లేతో వస్తోన్న OPPO Find X9s ఫోన్...50MP Main + 50MP UW + 50MP 3x Telephoto కెమెరాతో రానుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు. 7025mAh బ్యాటరీ సామర్థ్యంతో ఈ ఫోన్ రానుంది. కాగా 12GB + 256GB వేరియంట్ ఫోన్ ధర రూ.79,999 గా ఉండనుండగా, 12GB + 512GB మోడల్ ధర రూ..89,999గా ఫిక్స్ చేశారు.






