అత్యంత దృఢమైన బాడీతో వస్తున్న నోకియా కొత్త స్మార్ట్ ఫోన్

by Disha Web Desk 17 |
అత్యంత దృఢమైన బాడీతో వస్తున్న నోకియా కొత్త స్మార్ట్ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: నోకియా కంపెనీ నుంచి కొత్తగా స్మార్ట్ ఫోన్ విడుదల అయింది. ఈ మోడల్ పేరు ‘నోకియా XR 21’. ప్రస్తుతానికి ఇది ఎంపిక చేసిన దేశాల్లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. భారత్‌లో త్వరలో అమ్మకానికి రానుంది. దీని బాడీ అత్యంత దృఢంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. ఇది ఒకే ఒక 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌‌లో లభిస్తుంది. స్మార్ట్ ఫోన్ ధూళి, నీటి-నిరోధకత కోసం IP69K రేటింగ్‌తో వస్తుంది.



నోకియా XR 21 స్పెసిఫికేషన్స్

* 6.49-అంగుళాల పూర్తి-HD+ IPS LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్.

* డిస్‌ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

* ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5G SoC ద్వారా పనిచేస్తుంది.

* ఆండ్రాయిడ్ 12 అవుట్-ఆఫ్-ది-బాక్స్‌తో రన్ అవుతుంది.


* ఫోన్ బ్యాక్ సైడ్ 64MP+ 8MP కెమెరాలు ఉన్నాయి.

* ముందు సెల్ఫీల కోసం 16MP కెమెరా ఉంది.

* 33W వైర్డు ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 4,800mAh బ్యాటరీ ఉంది.

* ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్‌కు అమర్చారు.




Next Story

Most Viewed