డెస్క్‌టాప్‌‌లో WhatsApp వాడుతున్నారా..! అయితే ఇది మీకోసమే

by Disha Web |
డెస్క్‌టాప్‌‌లో WhatsApp వాడుతున్నారా..! అయితే ఇది మీకోసమే
X

దిశ, వెబ్‌డెస్క్: మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ వాట్సాప్ రోజు రోజకు కొత్త ఫీచర్స్‌ను వినియోగదారులకు పరిచయం చేస్తుంది. ఇప్పుడు మళ్లీ కొత్తగా సెక్యూరిటీ కోసం కొత్త ఆప్షన్‌ను తీసుకురానుంది. PC లేదా ల్యాప్‌టాప్‌లలో వాట్సాప్‌ను ఓపెన్ చేయడానికి కొత్తగా స్క్రీన్ లాక్ ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిపింది.

దీని ద్వారా ఇకమీదట డెస్క్‌టాప్‌లలో వాట్సాప్ వాడాలంటే తప్పనిసరిగా ప్రతిసారీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి. ఇంతకు ముందు డెస్క్‌టాప్‌లలో వాట్సాప్ ఉపయోగించాలంటే ఫోన్ నుంచి QR కోడ్‌ని స్కాన్ చేస్తే సరిపోయేది. ఒక్కసారి డెస్క్‌టాప్‌లో లాగిన్ అయితే ఇంకోసారి QR కోడ్‌ స్కాన్ చేయకున్నా వాట్సాప్ వాడవచ్చు. దీని వలన తమ వ్యక్తిగత సమాచారం ఇతరులకు కనిపిస్తుందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో మెటా యాజామాన్యం కొత్తగా భద్రత కోసం స్క్రీన్ లాక్ ఫీచర్‌ను తీసుకురానున్నట్లు పేర్కొంది. WhatsApp డెస్క్‌టాప్ కోసం పాస్‌వర్డ్ సెట్ చేయడం ద్వారా కావలసినప్పుడు వినియోగదారులు యాక్సెస్ పొందవచ్చు. ఒకవేళ పాస్‌వర్డ్ మర్చిపోయినా కూడా స్కానర్ ద్వారా లాగిన్ కావచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను సంస్థ టెస్టింగ్ చేస్తుంది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది.

Next Story

Most Viewed