జీమెయిల్‌లో కొత్త ఫీచర్‌.. ఇక ఆ మెయిల్స్‌కు చెక్ పెట్టండిలా..

by Naga Rani Yarlagadda |

గూగుల్ (Google) నిర్వహించే ఇ-మెయిల్ సర్వీస్.. జీమెయిల్ లో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జీమెయిల్‌లో కొత్త ఫీచర్‌.. ఇక ఆ మెయిల్స్‌కు చెక్ పెట్టండిలా..
X

దిశ, వెబ్‌డెస్క్: గూగుల్ (Google) నిర్వహించే ఇ-మెయిల్ సర్వీస్.. జీమెయిల్ లో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సబ్ స్క్రిప్షన్లను ఒకే చోట నిర్వహించేందుకు గాను మేనేజ్ సబ్ స్క్రిప్షన్ పేరుతో ఈ ఫీచర్ ను తీసుకొచ్చారు. దీని ద్వారా యూజర్లు ప్రమోషనల్ ఇ-మెయిల్స్ (E-Mails) అన్నింటినీ ఒకేచోట చూడవచ్చు. ఒక వేళ మీకు అవి అవసరం లేదనుకుంటే ఒకే క్లిక్‌లో అన్ సబ్ స్క్రైబ్ చేసేయొచ్చు. మీకు నచ్చని ప్రమోషనల్ ఇ-మెయిల్స్ ఫ్యూచర్లో మీ ఇన్‌బాక్స్‌లోకి రాకుండా ఈ ఫీచర్‌ను వాడుకోవచ్చని గూగుల్ బ్లాగ్ పోస్టు (Google Blog Post)లో తెలిపింది. వెబ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫామ్స్‌లలో జీమెయిల్ (G-Mail) వాడేవారందరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుందని గూగుల్ తెలిపింది. ట్రాష్ అనే ఫోల్డర్ కింద ఈ మేనేజ్ సబ్ స్క్రిప్షన్ ఆప్షన్ కనిపిస్తుంది. మీ యాక్టివ్ ఇ-మెయిల్ సబ్ స్ర్కిప్షన్లన్నింటినీ చూపిస్తుంది.

అలాగే న్యూస్ లెటర్స్, ప్రమోషనల్ మెసేజ్‌లు, డీల్ అలర్ట్స్ వంటివి కూడా ఈ ఫీచర్లో ఉంటాయి. ఒక సెండర్ నుంచి ఎన్ని మెయిల్స్ వస్తున్నాయన్న డీటెయిల్స్‌తో పాటు.. ఎక్కువగా మెయిల్స్ పంపేవారిని కూడా హైలైట్ చేస్తుంది. సెండర్ నుంచి వచ్చిన మెయిల్స్ అన్నీ ఒకేచోట కనిపించడంతో పాటు పక్కనే అన్ సబ్‌స్క్రైబ్ బటన్ కూడా కనిపిస్తుంది. మెయిల్ ఓపెన్ చేసి మీరు కూడా ఈ ఫీచర్‌ను చెక్ చేసి.. అవసరం లేని మెయిల్స్‌ను అన్ సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Next Story