Moto G57 Power 5G: మోటో నుంచి క్రేజీ ఫోన్‌..7000mAh బ్యాట‌రీ, ధ‌ర ఎంతంటే

by velandi.Saikiran |

మోటో జీ 57 పవర్ ( Moto G57 Power) పేరుతో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది

Moto G57 Power 5G: మోటో నుంచి క్రేజీ ఫోన్‌..7000mAh బ్యాట‌రీ, ధ‌ర ఎంతంటే
X

దిశ‌, వెబ్ డెస్క్‌: దేశీయ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటారోలో మరో అదిరిపోయే మొబైల్ లాంచ్ చేసింది. తక్కువ బడ్జెట్ లో, సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా మోటో జీ 57 పవర్ ( Moto G57 Power) పేరుతో కొత్త 5జీ స్మార్ట్ ఫోన్ తీసుకువచ్చింది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. 6.72 అంగుళాల ఎల్ఈడీ స్క్రీన్ కలిగి ఉన్న ఈ ఫోన్, ఆండ్రాయిడ్ 16తో వర్క్ చేస్తుంది. మోటో నుంచి వచ్చే ప్రతి ఫోన్ బ్యాటరీ సామర్థ్యం చాలా బాగా ఉంటుంది.

ఇక లేటెస్ట్ గా రిలీజ్ చేసిన Moto G57 Power మొబైల్ బ్యాటరీ సామర్థ్యం కూడా 7000 mah ఇచ్చారు. 33W ఛార్జ‌ర్ ఈ ఫోన్ కు స‌పోర్ట్ చేయ‌నుంది. సెల్ఫీల కోసం 8MP కెమెరా అందిస్తున్నారు. 50MP ప్రైమ‌రీ కెమెరాను ఇస్తున్నారు. Wi-Fi 802.11ac, Bluetooth 5.1 అందిస్తున్నారు. ఇక ఈ ఫోన్ బ‌రువు 210.6g మాత్ర‌మే ఉంటుంది. ఈ ఫోన్ మూడు క‌ల‌ర్స్ లో ల‌భించ‌నుంది. ఇక Moto G57 Power లో 8GB+128GB వేరియంట్ ధ‌ర‌ రూ. 14,999గా ఫిక్స్ చేశారు. అయితే బ్యాంక్‌, స్పెష‌ల్ ఆఫ‌ర్ల పేరుతో రూ. 12,999ల‌కే అందించ‌బోతున్నార‌ట‌. డిసెంబ‌ర్ 3వ తేదీ నుంచి ఫిప్ట్ కార్టులో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఆ రోజు నుంచి ఆన్ లైన్ లోనూ కొనుగోలు చేసుకోవ‌చ్చు.

Next Story