- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తక్కువ ధరలో మోటరోలా ఫోన్... అదిరిపోయే ఫీచర్లు ఇవే!
ఈ మొబైల్ ప్రారంభ ధర 20, 999 రూపాయలు ఉంది. అలాగే టాప్ వేరియంట్ 23 వేల రూపాయలుగా ఉంది. అయితే దీపావళిలో

దిశ, వెబ్ డెస్క్ : మార్కెట్లో ఎన్ని రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నప్పటికీ, మోటరోలాకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సామాన్యులు కూడా కొనుగోలు చేసేలా మొబైల్ ధరలు ఉంటాయి. అందుకే మార్కెట్ లో మోటరోలా సేల్స్ ఓ రేంజ్ లోనే ఉంటాయి. అయితే ఈ కంపెనీ నుంచి ఈ ఏడాది వచ్చిన సరికొత్త మొబైల్ మోటరోలా మోటో G96 5G (Motorola G96 5G). ఈ మొబైల్ ఈ ఏడాది జూలై 9వ తేదీన రిలీజ్ అయింది. మార్కెట్ లో ఈ మోడల్ విక్రయాలు కూడా బాగానే ఉన్నాయి. అయితే దీపావళి పండుగ నేపథ్యంలో ఈ మొబైల్ పై సరికొత్త ఆఫర్ తెరపైకి వచ్చింది.
ఈ మొబైల్ ప్రారంభ ధర 20, 999 రూపాయలు ఉంది. అలాగే టాప్ వేరియంట్ 23 వేల రూపాయలుగా ఉంది. అయితే దీపావళిలో భాగంగా ఫ్లిప్ కార్ట్‌లో ఈ మొబైల్ బేస్ మోడల్ రూ.15,999లకు అందిస్తున్నారు. అలాగే క్రెడిట్, ఇతర కార్డులు వారితే దీని ధర మరో వెయ్యి రూపాయలు తగ్గే ఛాన్సులు ఉంటాయి. పాత ఫోన్ ఎక్స్ చేంజ్ చేసుకుంటే రూ.3000 వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయి. అంటే ఓవరాల్ గా ఈ మొబైల్ 12,000 రూపాయలకు మనం కొనుగోలు చేయవచ్చు. అది మీ పాత మొబైల్ ఫోన్ కండిషన్ బట్టి ఉంటుంది.






