- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోటోరోలా నుంచి సన్నని ఫోన్..ధర, ఫీచర్స్ ఇవే
మోటోరోలా ఎడ్జ్ 70 ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.7 ఇంచుల డిస్ ప్లేతో వస్తున్న మోటోరోలా ఎడ్జ్ 70 ఫో

దిశ, వెబ్‌డెస్క్: భారత మార్కెట్లోకి రకరకాల మొబైల్ ఫోన్స్ వస్తున్నాయి. ఇందులో కొన్ని తక్కువ ధరలో వస్తుంటే మరికొన్ని ఖరీదైన ధరలకు ఫోన్లు మార్కెట్లోకి లాంచ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మోటోరోలా నుంచి మరో సరికొత్త ఫోన్ రాబోతోంది. మోటోరోలా ఎడ్జ్ 70 ( Motorola Edge 70) పేరుతో కొత్త ఫోన్ తీసుకు వస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటన చేసింది. ఈ మొబైల్ డిసెంబర్ 15 న ఇండియాలో లాంచ్ కాబోతుంది. డిసెంబర్ 15వ తేదీ నుంచి మోటరోలా షోరూంతో పాటు ఆన్లైన్ లో కూడా మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్లు లభించనున్నాయి.
అలాంటి మోటోరోలా ఎడ్జ్ 70 ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, 6.7 ఇంచుల డిస్ ప్లేతో వస్తున్న మోటోరోలా ఎడ్జ్ 70 ఫోన్ కు 50MP (Main) + 50MP (UW) రేర్ కెమెరా అందిస్తున్నారు. అటు సెల్ఫీల కోసం 50 MP ఫ్రంట్ కెమెరా ఇస్తోంది కంపెనీ. 5000mAh సామర్థ్యం ఉన్న ఈ ఫోన్ కు 68W (Wired) + 15W (Wireless) ఛార్జర్ సపోర్ట్ చేయనుంది. Android 16 ఆధారంగా ఈ ఫోన్ వర్క్ చేయనుంది. 5.99mm సన్నగా ఉంటుంది. మోటోరోలా ఎడ్జ్ 70 ఇండియాలో రూ.29 వేల నుంచి రూ.35 వేల మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది.






