- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
AI Robot : లవర్ లేదని బాధపడొద్దు.. AI గర్ల్ ఫ్రెండ్.. అరియాతో అన్నీ షేర్ చేసుకోవచ్చు బాసూ

Robot Girlfriend: టెక్నాలజీ రోజుకో కొత్త పుంతలు తొక్కుతుంది. రోజుకో కొత్త ఇన్వెన్షన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడంతా AI కాలం నడుస్తోంది. ఏఐ ద్వారా రూపొందించిన రోబో(Robot)లు అనేక రంగాల్లో అద్భుతాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే లాస్ వెగాస్ కన్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(Las Vegas Consumer Electronics Show)లో అరియా(Aria AI) అదరగొట్టింది. టెస్లా ఆప్టిమస్ రోబో తనకు బాగా నచ్చాడని వెల్లడించింది.
AI Robot: అందంగా కనిపించే రోబో(Robot)లు.. అచ్చంగా అమ్మాయిల్లాగే హాయ్, బాయ్ మాత్రమే కాదు..అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు కూడా చెబుతున్నాయి. తమకు నచ్చిన మగ రోబో పేరు కూడా చెప్పేస్తున్నాయి. అమెరికాలో నెవాడా రాష్ట్రం లాస్ వెగాస్(Las Vegas ) నగరం వేదికంగా జరిగిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో(Consumer Electronics Show)లో ఈ రోబోలు సందడి చేస్తున్నాయి. ఈ సందర్బంగా అరియా(Aria AI) అనే పేరుతో ఉన్న ఆడ రోబోతో ఓ మీడియా సంస్థ జర్నలిస్టు చిట్ చాట్ చేశారు.
మీడియా ప్రతినిథి ప్రశ్న: హాయ్ అరియా.. నీ సామర్థ్యాలు ఏంటో చెప్పగలవా?
అరియా : నాకు సోషల్ ఇంటెలిజెన్స్ ఉంది. నేను మనిషిలా హావభావాలు ప్రదర్శించగలను. అచ్చం వాళ్ల మాదిరే నా ప్రవర్తన ఉంటంది.
ప్రశ్న: నిన్ను ఎందుకు తయారు చేశారు ?
అరియా : మనుషులతో సన్నిహితంగా మెలగడం, కలుపుగోలుగా ఉండటానికి నన్ను తయారు చేశారు.
ప్రశ్న: నువ్వు ఏ రకం టెక్నాలజీతో పనిచేస్తున్నావు ?
అరియా : నేను ఈ విషయాన్ని మీకు చెప్పకూడదు.
ప్రశ్న : నువ్వు ఎవరైనా మగ రోబోను ఇష్టపడ్డావా ?
అరియా : అవును, టెస్లాకు చెందిన ఆప్టిమస్ రోబో నచ్చాడు. అతను అంటే నాకు ఇష్టం.
అరియాలో ఫీచర్లు(Aria Features):
మహిళా రోబో అరియా(Aria) చూడటానికి మనిషిలాగే ఉంది. దీన్ని రియల్ బోటిక్స్ కంపెనీ(Real Boutiques Company) తయారు చేసింది. బ్లాక్ కలర్ ట్రాక్ సూట్లో అరియా చాలాస్టైలిష్ గా నిలబడి ఇంటర్వ్యూ యర్ తో ముచ్చటపెట్టింది. జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ(Generative Artificial Intelligence Technology)తో అరియా పనిచేస్తుంది. ఇతర రోబోల కంటే ఎక్కవ ఎమోషనల్స్(Emotionals) అరియాలో ఉన్నాయి. అందుకే హాస్పిటల్స్, హోటల్స్, రెస్టారెంట్లు వంటి వాటిల్లో గెస్టుగా బాగా పనిచేయగలదు. ఇతరులతో సన్నిహితంగా మెలగడం, కలుపుగోలుపుగా ఉండటం అరియా స్పెషాలిటీ.
ఇక అరియా(Aria ) గొంతు నుంచి కళ్ల వరకు 17 ప్రత్యేకమైన మోటార్లను అమర్చినట్లు తెలిపారు. వాటి సాయంతోనే అది మనిషిలా హావభావాలను వ్యక్తపరుస్తుంది. అరియా మొహం కానీ, కలర్ కానీ, హెయిర్ స్టైల్ కానీ నచ్చకుంటే మార్చుకోవచ్చు. దీనికోసం వెసులుబాటు కల్పించేలా దాని నిర్మాణ స్వరూపం ఉంది.
అరియా రోబో మూడు వెర్షన్లలో లభిస్తుందని రియల్ బోటిక్స్ కంపెనీ(Real Boutiques Company) వర్గాలు వెల్లడించాయి. పూర్తిస్థాయి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ తో కూడిన అరియా రోబో కావాలంటే రూ. 1.50కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. మీడియం కేటగిరికి చెందిన అరియా కావాలంటే రూ. 1.29కోట్లకు అందుబాటులో ఉంటుంది. కేవలం బొమ్మ, తల, మెడ, భాగం మాత్రమే కావాలంటే రూ. 8.61లక్షలకు అందుబాటులో ఉంది.
సోషల్ మీడియాలో వైరల్:
అరియా(Aria ) ముఖ కవళికలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరియాను చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు. ఇది మొదటిసారి నిజమని నేను అనుకున్నాను..అచ్చం మనిషిలా కనిపిస్తుంది. రోబో అని గుర్తించలేకపోయాను అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..ఈ రోబోల చుట్టూ ప్రజలు ఎలా సుఖంగా ఉన్నారనేది నాకు వింతగా..కొంచెం భయంగా ఉందంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
How disturbing! pic.twitter.com/sW6Tvhnylz
— Visual feast (@visualfeastwang) January 10, 2025
ఇక రియల్‌బోటిక్స్ సీఈఓ ఆండ్రూ కిగుయెల్(RealBotics CEO Andrew Kiguel) మాట్లాడుతూ.. మనుషుల నుంచి వేరు చేయడం కష్టతరమైన రోబోలను రూపొందించడమే తమ కంపెనీ లక్ష్యం అని అన్నారు. ఈ రోబోట్ సమాజంలో పెరుగుతున్న పురుషుల ఒంటరితనం సమస్యకి కూడా ఒక పరిష్కారాన్ని అందించగలదు. ఇది ఒక శృంగార భాగస్వామి లాగా ఉంటుంది. బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్ లాగా ప్రవర్తిస్తుందని తెలిపారు.