Netflix దారిలో YouTube.. యాపిల్‌కు షాక్‌ఇచ్చిన కంపెనీ

by Disha Web Desk 17 |
Netflix దారిలో YouTube.. యాపిల్‌కు షాక్‌ఇచ్చిన కంపెనీ
X

దిశ, టెక్నాలజీ: టెక్ దిగ్గజం గూగుల్‌ యాజమాన్యంలోని YouTube, యాపిల్ కంపెనీకి చెందిన మిక్స్‌డ్ రియాలిటీ (MR) హెడ్‌సెట్ 'విజన్ ప్రో' కోసం ప్రత్యేక యాప్‌ను విడుదల చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ హెడ్‌సెట్ ద్వారా YouTube వీడియోలను చూడాలనుకుంటే నేరుగా వెబ్ బ్రౌజర్ వెర్షన్‌కు వెళ్లవలసి ఉంటుంది. ఇంతకుముందు స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ కూడా విజన్ ప్రో కోసం ఎలాంటి ప్రత్యేక యాప్‌ను లాంచ్ చేయమని పేర్కొనగా, ఇప్పుడు YouTube కూడా ఇదే నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే దీనికి గల సరైన కారణాన్ని సంస్థ పేర్కొనలేదు.

కంపెనీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.."విజన్ ప్రో లాంచ్‌ని చూడడానికి మేము సంతోషిస్తున్నాము, సఫారిలో మా వినియోగదారులకు వీడియోలను అందిస్తామని" పేర్కొన్నారు. అయితే కొన్ని కంపెనీలు మాత్రం తమ యాప్‌లను యాపిల్ 'విజన్ ప్రో' లో యాక్సెస్‌కు సపోర్ట్ ఇస్తున్నాయి, అవి టిక్‌టాక్, డిస్నీ+, మ్యాక్స్, డిస్కవరీ+, అమెజాన్ ప్రైమ్ వీడియో, పారామౌంట్+, పీకాక్‌తో సహా మొత్తం ఇరవై యాప్‌లు. యాపిల్ విజన్ ప్రో అమెరికాలోని కంపెనీ స్టోర్లలో, ఆన్‌లైన్లలో ముందస్తు బుకింగ్‌కు అందుబాటులో ఉంది.

Next Story

Most Viewed