మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్‌లు.. భయాందోళనలో ఉద్యోగులు

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-20 07:14:20  IST  )

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతోందన్న వార్త టెక్ రంగంలో కలకలం రేపుతోంది.

మైక్రోసాఫ్ట్‌లో మరోసారి లేఆఫ్‌లు.. భయాందోళనలో ఉద్యోగులు
X

దిశ, వెబ్ డెస్క్: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ (Microsoft) మరోసారి ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతోందన్న వార్త టెక్ రంగంలో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఈ ఏడాది మే నెలలో 6,000 మందిని, తరువాత మరింతగా 300 మందిని తొలగించిన సంస్థ, ఇప్పుడు మూడో విడత లేఆఫ్‌లకు ప్రణాళికలు సిద్ధం చేస్తోందని బ్లూమ్‌బర్గ్ (Bloomberg) నివేదించింది. జులై నెలలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చని అంచనా వేసింది. ఇక ఈసారి సేల్స్ విభాగంపై ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

మైక్రోసాఫ్ట్ సంస్థ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో సంస్థాగత పునర్నిర్మాణం చేపట్టుతోంది. ఈ నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ ఈ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక జులైలో ప్రారంభమయ్యే సంస్థ కొత్త ఆర్థిక సంవత్సరం దృష్ట్యా కంపెనీ పునర్వ్యవస్థీకరణను వేగవంతం చేస్తోంది.

గతంలో జరిగిన లేఆఫ్‌లలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ డెవలపర్లు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఇప్పుడు జరగబోయే కోతల్లో సేల్స్ బృందాలే ప్రధాన లక్ష్యంగా ఉండొచ్చని సమాచారం. కాగా, గతేడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్‌లో 2.28 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, వారిలో సుమారు 45,000 మంది సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉన్నారు. తాజా పరిణామాలతో ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Next Story