వాట్సాప్‌ యూజర్ల కోసం సరికొత్త అప్డేట్స్.. ఇకపై వీటితో మరింత ఫన్

by Ajay Maddhiboyina |

వాట్సాప్ యూజ‌ర్లను ఆక‌ర్షించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అప్డేట్ల‌ను తీసుకువ‌స్తోంది. భావాల‌ను చెప్పేందుకు ఇప్ప‌టికే ఎస్ఎంఎస్ లు, స్టిక్క‌ర్స్, గిఫ్ట్స్ ఉండగా ఇప్పుడు మోష‌న్ పోస్ట‌ర్లు, లైవ్ ఫోటోలు అనే ఆప్ష‌న్స్ సైతం తీసుకువ‌చ్చింది.

వాట్సాప్‌ యూజర్ల కోసం సరికొత్త అప్డేట్స్.. ఇకపై వీటితో మరింత ఫన్
X

దిశ‌, వెబ్ డెస్క్: వాట్సాప్ యూజ‌ర్లను ఆక‌ర్షించేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త అప్డేట్ల‌ను తీసుకువ‌స్తోంది. భావాల‌ను చెప్పేందుకు ఇప్ప‌టికే ఎస్ఎంఎస్ లు, స్టిక్క‌ర్స్, గిఫ్ట్స్ ఉండగా ఇప్పుడు మోష‌న్ పోస్ట‌ర్లు, లైవ్ ఫోటోలు అనే ఆప్ష‌న్స్ సైతం తీసుకువ‌చ్చింది. ప్ర‌స్తుతం iOSలో లైవ్ ఫోటోలు పంపుకునేందుకు ఇప్ప‌టికే అవ‌కాశం ఉండ‌గా, ఆండ్రాయిడ్ లో మోష‌న్ పోస్ట‌ర్స్ కు స‌పోర్ట్ చేస్తుంది. ఈ అప్డేట్స్ ద్వారా వినియోగదారులు సౌండ్ ‌తో కూడిన మోషన్ పోస్టర్స్, చిన్న క్లిప్స్ షేర్ చేసుకోవచ్చు.

కేవలం ఇమేజ్ లు మాత్రమే పంపుకోకుండా ఇలా మోషన్ పోస్టర్లు, లైవ్ ఇమేజెస్ పంపుకోవడం ద్వారా యూజర్లు మరింత ఫన్ పొందవచ్చు. వీటి ద్వారా చాటింగ్ లో ఎమోషన్స్ కూడా అర్థం అవుతాయి కాబట్టి ఎక్కువ మంది కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఈ ఏడాదే వాట్సాప్ లో చాట్ థీమ్ ప్రవేశపెట్టారు. అంటే కాకుండా మెటా ఏఐ ఇప్పుడు వినియోగదారులు తమ సంభాషణల కోసం స్వంతంగా థీమ్ లు రూపొందించుకోవడానికి సైతం అనుమతి ఇస్తుంది.

దీంతో మీ క్రియేటివిటీకి పదును పెడుతూ సంభాషణ మరింత సరదాగా సాగేలా చేయవచ్చు. మెటా ఏఐ ద్వారా మరికొరన్ని అప్డేట్స్ సైతం తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. వీడియోలు పంపేటప్పుడు వాటి బ్యాక్ గ్రౌండ్ ఎడిటింగ్ మార్చేలా ఈ ఫీచర్ ఉండబోతుందట. ఇక ఈ ఫీచర్ కూడా అందుబాటులోకి వస్తే వినియోగదారులు వాట్సాప్ ను మరింత ఎంజాయ్ చేస్తారు.

Next Story