జియో నుంచి మ‌రో క్రేజీ ఫోన్‌...7 రోజుల పాటు బ్యాట‌రీ బ్యాక‌ప్ !

by velandi.Saikiran |   (  Updated:2025-10-09 12:44:17  IST  )

జియో భారత్ ( JioBharat safety-first 4G )పేరుతో ఈ సరికొత్త మొబైల్ తీసుకువచ్చింది కంపెనీ. వినియోగదారుల సేఫ్టీ

జియో నుంచి మ‌రో క్రేజీ ఫోన్‌...7 రోజుల పాటు బ్యాట‌రీ బ్యాక‌ప్ !
X

దిశ‌, వెబ్ డెస్క్ : ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో అదిరిపోయే ప్రకటన చేసింది. తమ కంపెనీ నుంచి కొత్త 4జీ ఫీచర్ మొబైల్ ఫోన్ ను లాంచ్ చేసింది. జియో భారత్ ( JioBharat safety-first 4G )పేరుతో ఈ సరికొత్త మొబైల్ తీసుకువచ్చింది కంపెనీ. వినియోగదారుల సేఫ్టీ ముఖ్యమన్న ఉద్దేశంతోనే, ఈ మొబైల్ లాంచ్ చేశారు. అంతేకాదు భారతదేశంలోనే సేఫ్టీ మొబైల్ ఇదేనంటూ ఓ నినాదాన్ని కూడా జనాల్లోకి తీసుకువెళ్తున్నారు. అయితే అలాంటి ఈ జియో భారత్ పేరుతో లాంచ్ అయిన మొబైల్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిస్తే, ఈ మొబైల్ ఫోన్ కు ఒక్కసారి ఫుల్ చార్జింగ్ పెడితే దాదాపు వారం రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ పేర్కొంది.

తెలియని ఫోన్ నెంబర్ల‌ నుంచి వచ్చే కాల్స్ అలాగే మెసేజ్ ల‌ను కూడా వెంటనే బ్లాక్ చేసుకునే సదుపాయాన్ని ఇందులో అందిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఈ మొబైల్ వినియోగించుకునేలా తయారు చేశారు. వృద్ధులకు హెల్త్ టిప్స్ కూడా ఈ మొబైల్ అందించనుంది. మహిళల సేఫ్టీ ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ మొబైల్ తీసుకువచ్చారు. ఈ మొబైల్ ధర ఇండియాలో 799 రూపాయలుగా ఫిక్స్ చేశారు. జియో స్టోర్స్, ఇతర మొబైల్ రిటైల్ స్టోర్స్, అమెజాన్,స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ లాంటి ఈ-కామర్స్ లో కూడా మొబైల్ కొనుగోలు చేయవచ్చు.

Next Story