జియో క్రేజీ ప్లాన్... రూ.200తో 15 ఓటీటీలు ఫ్రీగా చూడొచ్చు !

by velandi.Saikiran |

జియో క్రేజీ ప్లాన్ లో భాగంగా రూ.200తో రీఛార్జ్ చేస్తే 15 ఓటీటీలు ఫ్రీగా చూడొచ్చు.

జియో క్రేజీ ప్లాన్... రూ.200తో 15 ఓటీటీలు ఫ్రీగా చూడొచ్చు !
X

దిశ‌, వెబ్ డెస్క్: వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది జియో. OTT ప్రేక్షకుల కోసం కొత్త ప్లాన్ తీసుకువచ్చింది. కేవలం రూ.200లతో రీఛార్జ్ చేసుకుంటే.. జియో OTT పాస్ అందించేందుకు సిద్ధమైంది. ఈ ప్యాక్ తీసుకుంటే, 28 రోజుల పాటు 15 OTT ఫ్లాట్ ఫామ్ ల కంటెంట్ అందించడమే కాకుండా... జియో టీవీలో 1000 టీవీ ఛానల్స్ కూడా చూడవచ్చని ప్రకటన చేసింది. దాంతో పాటు 28 రోజుల పాటు 30జీబి హై స్పీడ్ డేటా ఇచ్చేందుకు జియో ముందుకు వచ్చింది. యూట్యూబ్ ప్రీమియం, జియో హాట్ స్టార్, ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్, సోనీ లివ్, డిస్కవరీ ప్లస్, ఫ్యాన్ కోడ్ లాంటి 15 ఓటీటీల సబ్ స్క్రిప్షన్ అవ‌కాశం దక్కనుంది.

ఈ ప్యాక్ ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే ?

జియో ప్రకటించిన ఈ ఆఫర్ యాక్టివేట్ చేసుకోవడానికి ఆఫీసుల చుట్టూ తిర‌గాల్సిన పని లేదు. చాలా సులభంగానే దీని ప్రాసెస్ ఉంటుంది. మై జియో యాప్, jio.com వెబ్ సైట్, రిటైల్ స్టోర్ లలో ఈ ఆఫర్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అలా కుదరకపోతే ఫోన్ పే, గూగుల్ పే లాంటి థర్డ్ పార్టీ రీఛార్జ్ యాప్స్ ద్వారా ఈ ప్లాన్ యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త ప్లాన్ అర్హత పొందాలంటే కచ్చితంగా మొబైల్ లో ఏదైనా ఒక యాక్టివ్ బేస్ ప్లాన్ కచ్చితంగా ఉండాల్సిందే. అలా లేకపోతే ఈ ఆఫర్ వర్తించబోదు.

Next Story