IPHONE FOLD: ఫోల్డ్ డిజైన్‌తో ఐఫోన్ 18 సిరీస్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే

by Ajay Maddhiboyina |

ఐఫోన్ 17 సిరీస్ ఇప్పటికే మార్కెట్ లో విడుదలై ప్రేక్షకుల మనసు దోచుకోగా ఇప్పుడు 18 సిరీస్ (IPHONE 18) కోసం టెక్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 18 సీరీస్‌కు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి.

IPHONE FOLD: ఫోల్డ్ డిజైన్‌తో ఐఫోన్ 18 సిరీస్.. ధర, ఫీచర్స్ వివరాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్: ఐఫోన్ 17 సిరీస్ ఇప్పటికే మార్కెట్ లో విడుదలై ప్రేక్షకుల మనసు దోచుకోగా ఇప్పుడు 18 సిరీస్ (IPHONE 18) కోసం టెక్ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 18 సీరీస్‌కు సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 18 సిరీస్ ద్వారా ఐఫోన్ ఫోల్డ్‌ (I PHONE FOLD)ను తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది బుక్ డిజైన్ కలిగి ఉంటుందని, సామ్ సంగ్ (SAMSUNG FOLD), రెడ్ మీ, వివో, గూగుల్ పిక్సల్ (GOOGLE PIXEL) ఫోల్డబుల్ మొబైల్స్‌కు పోటీ ఇస్తుందని టాక్ వినిపిస్తోంది.

అదే విధంగా ఫోల్డబుల్ ఐఫోన్ టైటానియం, అల్యూమినియం మిశ్రమంతో తయారు చేయబడిన ఫ్రేమ్ కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదేవిధంగా ఐఫోన్ ఫోల్డ్ 7.8 అంగుళాల లోపలి డిస్‌ప్లే మరియు 5.5 అంగుళాల బయటి స్క్రీన్‌తో బుక్ డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో శక్తివంతమైన ఏ20 ప్రో చిప్, 12జీబీ ర్యామ్ మరియు 256జీబీ ఇంటర్నల్ మెమోరీ ఉండబోతుందట.

ఇందులో 48MP రేర్ కెమెరా సెటప్ మరియు అండర్ డిస్ ప్లే సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదే విధంగా ఈ ఫోన్ లో 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇక అమెరికాలో దీని ధర 2వేల డాలర్ల వరకు ఉంటే, భారత దేశంలో దీని ప్రారంభ ధర రూ.1,75,000 నుండి రూ.2,20,000 మధ్య ఉండవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. అంతే కాకుండా 2026 సెప్టెంబర్‌లో దీనిని లాంచ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story