iPhone 18 Pro Max ఫీచర్స్ లీక్.. ధర, విడుదల తేదీ వివరాలు ఇవే!

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-14 11:36:26  IST  )

ఐఫోన్ 17 సిరీస్ గ‌త నెల విడుద‌లవ్వ‌గా జ‌నాలు స్టోర్స్ బ‌య‌ట ప‌డిగాపులు కాచి మ‌రీ కొనుగోలు చేశారు. ఫోన్ ఫీచ‌ర్స్ గ్యాడ్జెట్ యాపిల్ ల‌వ‌ర్స్‌ను కట్టిపడేయడంతో 17సిరీస్ బుకింగ్స్ భారీగా పెరిగిపోయాయి. కాగా ఇప్పుడు iPhone 18 సిరీస్ గురించి చర్చ మొదలైంది.

iPhone 18 Pro Max ఫీచర్స్ లీక్.. ధర, విడుదల తేదీ వివరాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ఐఫోన్ 17 సిరీస్ గ‌త నెల విడుద‌లవ్వ‌గా జ‌నాలు స్టోర్స్ బ‌య‌ట ప‌డిగాపులు కాచి మ‌రీ కొనుగోలు చేశారు. ఫోన్ ఫీచ‌ర్స్ గ్యాడ్జెట్ యాపిల్ ల‌వ‌ర్స్‌ను కట్టిపడేయడంతో 17సిరీస్ బుకింగ్స్ భారీగా పెరిగిపోయాయి. కాగా ఇప్పుడు iPhone 18 సిరీస్ గురించి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే iPhone 18 Pro Max గురించి పలు కథనాలు వస్తున్నాయి. ఫోన్ ధర, ఫీచర్స్ ఇవేనంటూ తెగ ప్రచారం జరుగుతోంది. iPhone 18 Pro Maxలో డిజైన్‌తో సహా చాలా అప్డేట్స్ తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ 17ప్రో మాక్స్ తో పొలిస్తే పరిమాణంలో ఐఫోన్ 18ప్రో మ్యాక్స్ చిన్నగా ఉండనుంది. అదే విధంగా ఈ మోడల్ ఫోల్డ్ డిజైన్ తో రాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

ఇందులో కూడా కెమెరా ప్లేస్ మెంట్ iPhone 17 Pro Max ఉండనుందని తెలుస్తోంది. ఇందులో హీటింగ్ సమస్యను మరింత తగ్గించడానికి స్టెయిన్ లెస్ థర్మల్ వేఫర్ ప్యానల్ తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అంతే కాకుండా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్‌లో 6.9 అంగుళాల డిస్ ప్లే ఉండబోతున్నట్టు సమాచారం. అదే విధంగా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లో 48 మెగాపిక్సల్ ప్రధాన సెన్సార్‌కు వేరిబుల్ ఎపర్చర్ అనే టెక్నాలజీ తీసుకురాబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీని వల్ల చీకట్లో కూడా ఫోటోలు మరింత క్లియర్‌గా వచ్చే అవకాశం ఉంది.

కెమెరా కంట్రోల్ బటన్‌లో కూడా మార్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఐఫోన్ 18ప్రో మాక్స్ A20 ప్రో చిప్ ద్వారా పనిచేయబోతుందట. దీనిద్వారా ఫోన్ సమర్థవంతంగా పనిచేయడంతో పాటు ఏఐ ఫీచర్స్‌తో రాబోతుందని తెలుస్తోంది. ఇక ఎప్పుడు లాంచ్ అవుతుందో ఖచ్చితమైన తేదీని ఆపిల్ ప్రకటించలేదు కానీ 2026 సెప్టెంబర్ రెండవ వారంలో వచ్చే అవకాశాలు ఉన్నట్టు టెక్ దునియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ధర రూ.1,59,900గా ఉండగా ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ లాంచింగ్ ధర కూడా అంతే ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

Next Story