చిన్ననాటి మీతో ‘మీరు’ ముచ్చటిస్తే.. నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్న ‘ఏఐ’ ట్రెండ్! ఎలా చేయాలంటే..?

by Ramesh Naini |

మీ చిన్ననాటి రూపం, మీ ప్రస్తుత రూపం పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో ‘మీట్ యువర్ యంగర్ సెల్ఫ్’ (Meet your younger self) అనే ట్రెండ్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

చిన్ననాటి మీతో ‘మీరు’ ముచ్చటిస్తే.. నెట్టింట సెన్సేషన్ సృష్టిస్తున్న ‘ఏఐ’ ట్రెండ్! ఎలా చేయాలంటే..?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రతి ఒక్కరి జీవితంలోనూ చిన్ననాటి జ్ఞాపకాలు ఎంతో ప్రత్యేకం. అప్పటి పాత ఆల్బమ్స్ చూసుకుంటే కలిగే ఆ మధురమైన అనుభూతే వేరు. అయితే, ఇప్పుడు ఆ పాత జ్ఞాపకాలకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) తోడైంది. మీ చిన్ననాటి రూపం, మీ ప్రస్తుత రూపం పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకుంటున్నట్లుగా అనిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌తో ‘మీట్ యువర్ యంగర్ సెల్ఫ్’ (Meet your younger self) అనే ట్రెండ్ ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఏంటి ఈ ఏఐ ట్రెండ్? ఎందుకు ఇంత ఫేమస్?

అసలేంటి ఈ ట్రెండ్? ఎందుకు ఇంత ఫేమస్ అయ్యింది? మీరూ ఈ ట్రెండ్‌లో భాగం కావాలంటే ఎలా క్రియేట్​ చేసుకోవాలి? తదితర వివరాలు మీకోసం.. సాధారణంగా మనం చిన్నప్పటి ఫోటోలను, ఇప్పటి ఫోటోలను పక్కపక్కన పెట్టి ‘కోల్లెజ్’ చేస్తుంటాం. కానీ ఈ ఏఐ ట్రెండ్ దానికి చాలా దూరం. చాట్​జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్‌ను ఉపయోగించి, మీ చిన్ననాటి ముఖకవళికలను ఏమాత్రం మార్చకుండా, ప్రస్తుత మీ రూపంతో కలిసి ఒకే ఫ్రేమ్‌లో ఉండేలా అత్యంత సహజమైన చిత్రాలను (Ultra-realistic images) ఇది సృష్టిస్తోంది.

ఈ రెండు రూపాలు ఒకరినొకరు చూసుకుంటూ

ముచ్చటించుకుంటున్నట్లుగా, సినిమాటిక్ ఫీల్‌ను అందించడం ఈ ట్రెండ్ ప్రత్యేకత. ‘ఈ ఫోటోలు కేవలం చిత్రాలు మాత్రమే కాదు, మన జీవిత ప్రయాణాన్ని ఒకే ఫ్రేమ్‌లో చూపిస్తున్న అద్భుతాలు’ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అంజు బేబీ రోజ్ అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ ట్రెండ్‌కు సంబంధించి కొన్ని ప్రత్యేకమైన ‘ప్రాంప్ట్స్’ పంచుకోవడంతో ఇది మరింత వైరల్ అయ్యింది.

మీరూ ట్రై చేయాలనుకుంటున్నారా?

మీరు ట్రై చేయాలనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. ఎలాంటి ఫోటో ఎడిటింగ్ స్కిల్స్ లేకపోయినా, ఏఐ టూల్స్ సహాయంతో సులభంగా మీ చిత్రాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫోటోల ఎంపిక.. ముందుగా మంచి లైటింగ్‌లో ఉన్న, మీ ముఖం స్పష్టంగా కనిపించే ఇప్పటి ఫోటోను ఒకటి ఎంచుకోండి. అలాగే, ముఖకవళికలు స్పష్టంగా తెలిసే మీ చిన్ననాటి ఫోటోను తీసుకోండి. ChatGPT (ఇమేజ్ జనరేషన్ ఫీచర్ ఉన్నది) లేదా మరేదైనా ఏఐ ఇమేజ్ టూల్‌ను ఓపెన్ చేయండి. మీ రెండు ఫోటోలను అప్‌లోడ్ చేసి, మీకు ఎలాంటి సీన్ కావాలో వివరిస్తూ స్పష్టమైన ‘ప్రాంప్ట్’ ఇవ్వండి. టూల్ ఇమేజ్‌ను జనరేట్ చేసిన తర్వాత, దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని మీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆకర్షణీయమైన క్యాప్షన్‌తో షేర్ చేయండి.

అద్భుతమైన అవుట్‌పుట్ కోసం ఈ ‘ప్రాంప్ట్’ వాడండి:

క్లాసిక్ లుక్, లేదా స్టూడియో స్టైల్ బ్లాక్ అండ్ వైట్ ఫోటో కోరుకునే వారు ఈ కింది ఇంగ్లీష్ టెక్స్ట్‌ను కాపీ చేసి మీ ఏఐ టూల్‌లో కమాండ్‌గా ఇవ్వండి.

“Create an ultra-realistic, soft, emotional black-and-white (slightly warm-toned) studio-style photograph using the provided images. On the left, show a younger version of me from my childhood photo, preserving exact facial features, smiling and looking towards the right. On the right, show my present self looking at my younger self with a calm smile. Place a simple table between both versions to symbolise time. Use soft cinematic lighting, a minimal studio background, realistic proportions and high photographic quality. Format: Aspect ratio 4:5.”

గమనిక: ఏఐ టూల్స్ కొన్నిసార్లు చిన్న చిన్న తప్పులు చేసే అవకాశం ఉంది. అవుట్‌పుట్ మీ అంచనాలకు తగ్గట్టుగా రాకపోతే, ప్రాంప్ట్‌లో చిన్నపాటి మార్పులు చేస్తూ (ఉదాహరణకు: బ్యాక్‌గ్రౌండ్ కలర్, లైటింగ్, ఎక్స్‌ప్రెషన్స్) మీకు నచ్చిన పర్ఫెక్ట్ ఇమేజ్ వచ్చేలా క్రియేట్ చేసుకోండి. మరెందుకు ఆలస్యం.. మీ చిన్ననాటి జ్ఞాపకాలను ఏఐతో కొత్తగా ఆస్వాదించండి!

Next Story