- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీల్స్ చూసేవారికి గుడ్ న్యూస్.. ఇన్‌స్టాలో మరో సరికొత్త ఫీచర్
ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మెటాకు చెందిన ఇన్‌స్టాగ్రామ్ తన యూజర్ల అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ మెటాకు (Meta) చెందిన ఇన్‌స్టాగ్రామ్ (Instagram) తన యూజర్ల అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా ఎప్పటికప్పుడూ కొత్త ఫీచర్లను పరిచయం చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో వినూత్నమైన ఫీచర్‌ను టెస్టింగ్ దశలో ప్రవేశపెట్టింది. రీల్స్ చూసే యూజర్ల కోసం 'ఆటో స్క్రోల్' అనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా రీల్స్‌ను మనం వేళ్లతో స్క్రోల్ చేయకుండానే, ఒక రీల్ పూర్తయ్యాక వెంటనే తదుపరి రీల్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. దీని వల్ల యూజర్ అనుభవం మరింత స్మూత్‌గా మారనుంది.
ఈ ఆటో స్క్రోల్ ఫీచర్ క్రియేటర్లకు భారీగా లాభం చేకూర్చే అవకాశం ఉంది. మరింత ఎక్కువ మంది యూజర్లు కంటెంట్‌ను నిరంతరంగా వీక్షించే అవకాశం ఉండటంతో, వ్యూస్ సంఖ్య పెరగొచ్చు. అల్గారిథమ్‌లు ఎక్కువగా ప్లే అయ్యే కంటెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల, రీల్ రీచ్ కూడా గణనీయంగా పెరిగే అవకాశముంది. అయితే, ఈ ఫీచర్‌కు సంబంధించి కొన్ని ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆటో స్క్రోల్ కారణంగా యూజర్లలో డిజిటల్ అడిక్షన్ పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్క్రోల్ చేయాల్సిన అవసరం లేకపోవడంతో, "ఇక్కడ ఆగాలి" అనే ఆలోచన తలెత్తదు. ఇది యూజర్‌ను నిరంతరంగా స్క్రీన్ ముందు కూర్చునేలా చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ దశ విజయవంతమైతే, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి రానుంది.






