డ్యూటీ ఎగ్గొట్టేందుకు ఉద్యోగి కన్నింగ్ ప్లాన్.. యాక్సిడెంట్ అయినట్టు AIతో ఫొటోలు క్రియేట్

by Muthe.Rajitha |

సాధారణంగా ఉద్యోగులు ఆఫీస్ డుమ్మా కొట్టి ఎంజాయ్ చేయడానికి లీవ్ కావాలంటే తాత చనిపోయాడు అనో, బాగా జ్వరం వచ్చిందనో చెబుతారు.

డ్యూటీ ఎగ్గొట్టేందుకు ఉద్యోగి కన్నింగ్ ప్లాన్.. యాక్సిడెంట్ అయినట్టు AIతో ఫొటోలు క్రియేట్
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా ఉద్యోగులు ఆఫీస్ డుమ్మా కొట్టి ఎంజాయ్ చేయడానికి లీవ్ కావాలంటే తాత చనిపోయాడు అనో, బాగా జ్వరం వచ్చిందనో సులువుగా అబద్దం చెబుతారు. అయితే ఓ ఉద్యోగి మరికాస్త ముందుకు వెళ్లి ఓ కన్నింగ్ ప్లాన్ వేసాడు. AI సహాయంతో ఉత్తుత్తి యాక్సిడెంట్ అయినట్టు HR ను బురిడీ కొట్టించి, లీవ్ తీసుకున్నాడు. అయితే అది నోటిమాటగా చెప్పడం అయితే ఇంత చర్చ జరగకపోవు గాని, నానో బననా యాప్ ఉపయోగించి నిజంగా ప్రమాదం జరిగినట్టు ఫోటోలు క్రియేట్ చేయడం సంచలనం రేపింది. గూగుల్ అప్ గ్రేడెడ్ నానో బననా AI యాప్ కి తన చేయి ఫోటో పంపి, బైక్ ప్రమాదంలో చేయికి గాయం అయినట్టు ఫోటో ఇవ్వమని అడగటంతో.. AI నిజంగానే చేతికి గాయం అయినట్టు రియలిస్టిక్ ఇమేజ్ ఇచ్చింది.

ఆ ఫోటో వాడి HR ను లీవ్ అడగ్గా.. HR కూడా అది నిజమైన గాయమేనని నమ్మి సెలవు ఇచ్చి, వెంటనే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకొని, రెస్ట్ తీసుకోమని చెప్పింది. అయితే అంత రియలిస్టిక్ నానో బననా యాప్ ఇమేజెస్ ఇవ్వడంపై ఆ ఉద్యోగి షాక్ గురయ్యి.. జరిగిన విషయాన్ని, HR తో జరిగిన సంభాషణ మొత్తం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ గా మారింది. AI చాలా ప్రమాదకారిగా మారబోతోందని కొంతమంది నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా.. టెక్నాలజీని మంచికోసమే వాడాలని మరికొందరు సూచిస్తున్నారు.

Next Story