- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భావాలకు భాష అయిన ఎమోజీలు.. నేడు వరల్డ్ ఎమోజీ డే
ప్రస్తుతం డిజిటల్ యుగం (Digital era) నడుస్తోంది.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం డిజిటల్ యుగం (Digital era) నడుస్తోంది. ఈ యుగంలో కమ్యూనికేషన్ విధానం పూర్తిగా మారిపోయింది. కాల్స్‌కు బదులుగా ఇప్పుడు మెసేజింగ్‌కి ప్రాధాన్యత పెరిగింది. ఎవరితోనైనా తక్షణమే, సులభంగా మాట్లాడుకునే అవకాశం టెక్నాలజీ అందిస్తోంది. ముఖ్యంగా యువత ఆధునిక చాటింగ్ యాప్స్‌లో ఎక్కువగా సమయాన్ని గడుపుతోంది. ఈ చాటింగ్ సంభాషణల్లో తమ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఎమోజీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. సంతోషం, బాధ, ఆశ్చర్యం, ప్రేమ, కోపం.. ఇలా అనేక రకాల భావాలను ఒక్క ఎమోజీతోనే తెలియజేయగలగడం వల్ల వీటి వినియోగం విపరీతంగా పెరిగింది. చిన్న చిన్న ముఖచిత్రాల్లా కనిపించే ఈ ఎమోజీలు మాటలకంటే బలంగా మనసులోని భావాలను వ్యక్తం చేస్తున్నాయి. అందుకే ప్రతి ఏడాది జూలై 17న ప్రపంచ ఎమోజీడేని (World emoji day) జరుపుకొంటారు.
ఎమోజీలను పిక్టోగ్రాఫ్‌లు, లోగోగ్రామ్‌లు, ఐడియోగ్రామ్‌లు లేదా స్మైలీలు అని కూడా పిలుస్తారు. ఎమోజీల వాడకం ఇప్పుడు మొదలైంది కాదు.. 1999లోనే ఎమోజీలను ఉపయోగించారు. 2000 సంవత్సరం నుంచి వీటి వాడకం తారాస్థాయికి చేరుకుంది. జపాన్‌కు చెందిన ఎన్‌టీఈ డొకొమో అనే టెలికాం కంపెనీలో పనిచేస్తున్న షిగేటక కురిటా అనే వ్యక్తి.. వాతావరణ స్థితిగతులను తెలియజేసేందుకు ఎమోజీలను వాడాడు. దీంతో అతన్ని అందరూ మిస్టర్ ఎమోజీ అని పిలవడం మొదలు పెట్టారు. ఇక 2002 జులై 17న సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ యాపిల్ క్యాలెండర్ ఎమోజీని తయారు చేసింది. దీనికి గుర్తుగా క్యాలెండర్‌లో జులై 17వ తేదీయే డిఫాల్ట్‌గా ఉంటుంది. అయితే 2014లో జెర్మీ బర్జ్ అనే వ్యక్తి వికీపీడియా సైట్ లాగే ఎమోటికన్‌ల (ఎమోషన్ + ఐకాన్) కోసం ప్రత్యేకంగా ఎమోజీపీడియాను రూపొందించాడు. ఇందులో యాపిల్ క్యాలెండర్ ఎమోజీని తయారు చేసిన రోజు జులై 17నే ఆయన వరల్డ్ ఎమోజీ డేగా పేర్కొన్నాడు. అందుకే ఈ రోజునే వరల్డ్ ఎమోజీ డేగా జరుపుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3,790 ఎమోజీలు అధికారికంగా వినియోగంలో ఉన్నాయని యూనికోడ్ కన్సార్టియం ప్రకటించింది. ఈ ఎమోజీలు ముఖ భావాలు, ప్రేమ, ఆహారం, పశుపక్ష్యాదులు, వృత్తులు, జెండాలు, చర్మ రంగాలు, లింగ భేదాలు వంటి అనేక విభాగాల్లో విభజించబడ్డాయి. యూనికోడ్ 16.0 తాజా వెర్షన్ ద్వారా 8 కొత్త ఎమోజీలను ఇటీవలే జత చేశారు. ప్రతి సంవత్సరం టెక్నాలజీ అభివృద్ధికి అనుగుణంగా కొత్త ఎమోజీలను రూపొందించి వాటిని అధికారికంగా చేర్చడం జరుగుతోంది. ఈ ప్రక్రియ ద్వారా ఎమోజీల సంఖ్య పెరుగుతూనే ఉంది.
భారత్‌లో ఎక్కువగా ఉపయోగించే కొన్ని ఎమోజీలు
😂 ఏదైనా సరదా విషయం, జోక్‌కి ఎక్కువగా వాడతారు.
❤️ ప్రేమ, మమకారం వ్యక్తీకరించేందుకు అత్యధికంగా ఉపయోగిస్తారు.
🙏 ధన్యవాదం, నమస్కారం లేదా ప్రార్థనను సూచించే ఈ ఎమోజీ భారతీయ సంస్కృతిలో ప్రత్యేక స్థానం పొందింది.
😍 ఆకర్షణ చూపించడానికి తరచుగా వాడే ఎమోజీ.
🤣 కడుపుబ్బా నవ్వే సందర్భాల్లో ఉపయోగిస్తారు.
😊 శాంతిగా, సంతోషంగా స్పందించేందుకు ఈ ఎమోజీని ఎంపిక చేస్తారు.
😭 బాధ, నష్టాన్ని తెలియజేయడంలో ఎక్కువగా వాడతారు.
🥰 ప్రేమభరితమైన స్పందనలకు ఇది పాపులర్.
😘 ఆప్యాయత చూపించడంలో వాడే ఎమోజీ.
💔 ప్రేమలో కలిగిన నష్టాన్ని వ్యక్తం చేయడానికి వాడతారు.






