కనిపించకుండా పోయిన మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ డౌన్‌లోడ్ చేసుకోవాలా? ఇలా చేయండి?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-08-14 04:57:41  IST  )

ప్రస్తుతం యువత అత్యధికంగా వినియోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్. దాదాపు ప్రతిఒక్కరి ఫోన్‌లోనూ ఈ యాప్ కనిపిస్తోంది.

కనిపించకుండా పోయిన మీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ డౌన్‌లోడ్ చేసుకోవాలా? ఇలా చేయండి?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం యువత అత్యధికంగా వినియోగిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇన్‌స్టాగ్రామ్. దాదాపు ప్రతిఒక్కరి ఫోన్‌లోనూ ఈ యాప్ కనిపిస్తోంది. రీల్స్, ఫోటోలు, స్టోరీలు ఇలా ఎన్నో అదిరిపోయే ఫీచర్స్ ఉండటం వల్లే యూజర్లు ఎక్కువగా దీనికి ఆకర్షితులు అవుతున్నారు. ఇక ఆకట్టుకునే ఇన్ స్టా ఆప్షన్స్‌లో హైలైట్స్ కూడా ఒకటి. మనం ట్రావెల్ చేసిన ప్రదేశాలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు, లేదా ఏదైనా వేడుకకు సంబంధించిన ఫోటోలు లేదంటే ఇష్టమైన ఫోటోలు స్టోరీలుగా పెట్టుకుంటాం. అయితే అలాంటి స్టోరీలను హైలెట్స్ గా సేవ్ చేసుకునే ఆప్షన్ ఉందని అందరికీ తెలుసు. కానీ ఒకవేళ మనం హైలైట్స్‌గా ఎన్నుకోకపోతే ఇన్ స్టా స్టోరీ 24గంటలకు కనిపించకుండా పోతుంది. అయితే మనం స్టోరీగా పెట్టుకున్నవాటిలో కొన్ని ముఖ్యమైన లేదా మనకు కావాల్సిన ఫోటోలు లేదా వీడియోలు ఉండచ్చు.

దీంతో వాటిని ఎలా చూడాలో తెలియక కంగారు పడతాం. కానీ మనం స్టోరీగా పెట్టిన ప్రతి స్టోరీని తిరిగి పొందవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా యాప్‌లో కుడివైపు కింద ఉన్న ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి. తరవాత కుడివైపు ఉన్న మూడు లైన్స్ పై క్లిక్ చేస్తే అర్చివ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయగానే మనం గతంలో పెట్టిన స్టోరీస్ అన్నీ కనిపిస్తాయి. మీరు ఇన్ స్టా వాడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ స్టోరీ పెట్టినా అందులో ఉంటుంది. దానిని మీరు డౌన్ లోడ్ చేసుకోవాలి అనుకుంటే స్టోరీ ఓపెన్ చేసిన కుడివైపు కింద ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి. అప్పుడు సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అది మీ గ్యాలరీలోకి వస్తుంది. ఇలా మీకు కావాల్సిన స్టోరీలు అన్నీ ఒకదాని తరవాత ఒకటి డౌన్ లోడ్ చేయవచ్చు. అంతే కాకండా మీరు షేర్ చేసిన రీల్స్ కూడా చూడవచ్చు. వాటిని హైలైట్ గా మార్చుకోవచ్చు.

Next Story