దీపావళి సేల్.. ఐఫోన్ 16, ఐఫోన్ 17 రెండింటిలో ఏది కొంటే బెటర్?

by Ajay Maddhiboyina |

ద‌స‌రాతో మొద‌లైన ఆన్ లైన్ షాపింగ్ క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫ‌ర్స్ ఇంకా కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావ‌ళి సేల్ (flipkart big bang sale), అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్ (amazon sale) లో ప‌లు వ‌స్తువుల‌పై భారీ డిస్కౌంట్స్ ల‌భిస్తున్నాయి.

దీపావళి సేల్.. ఐఫోన్ 16, ఐఫోన్ 17 రెండింటిలో ఏది కొంటే బెటర్?
X

దిశ‌, వెబ్ డెస్క్: ద‌స‌రాతో మొద‌లైన ఆన్ లైన్ షాపింగ్ క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫ‌ర్స్ ఇంకా కొన‌సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఫ్లిప్ కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావ‌ళి సేల్ (flipkart big bang sale), అమెజాన్ గ్రేట్ ఇండియ‌న్ సేల్ (amazon sale) లో ప‌లు వ‌స్తువుల‌పై భారీ డిస్కౌంట్స్ ల‌భిస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్స్‌పై మంచి ఆఫ‌ర్స్ ఉన్నాయి. అదే విధంగా ఐఫోన్ లపై కూడా డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. దీంతో ఐఫోన్ లవర్స్ చాలా మంది ఐఫోన్ 16 కొనుగోలు చేస్తే మంచిదా లేదంటే ఐఫోన్ 17 కొనుగోలు చేస్తే మంచిదా అనే సందేహంలో ఉన్నారు.

అలాంటి వాళ్లు డౌట్ లేకుండా ఏది ఎంచుకోవాలో చూద్దాం.. ఐఫోన్ 16 (i phone 16) లాంచింగ్ ధ‌ర ఇండియాలో రూ.79,900 కానీ ప్ర‌స్తుతం అమెజాన్ లో దీని ధ‌ర రూ.66,990గా ఉంది. ఇక ఐఫోన్ 17 (i phone 17) అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల‌లో రూ.82,900గా ఉంది. అంతే కాకుండా కొన్ని బ్యాంక్ ఆఫ‌ర్స్ ద్వారా తీసుకుంటే రూ.79,999కే ల‌భిస్తుంది. అంటే ఐఫోన్ 16, ఐఫోన్ 17 మ‌ధ్య దాదాపు రూ.13వేలు తేడా ఉంది.

ఇక ఈ రెండింటిలో ఏది తీసుకోవాలి అనే విష‌యానికి వ‌స్తే... కొత్త ఫీచ‌ర్లు, సున్నిత‌మైన డిస్ ప్లే, మెరుగైన సెల్ఫీ కెమెరాతో పాటు ప్ర‌కాశ‌వంత‌మైన డిస్ ప్లే కావాలి అనుకుంటే ఐఫోన్ 17 తీసుకోండి. ఒక‌వేళ బ‌డ్జెట్ ముఖ్యం అనుకుంటే రూ.66వేల కంటే మ‌రింత త‌క్కువ‌కే వ‌చ్చే ఐఫోన్ 16 తీసుకోవ‌డం బెట‌ర్. ధ‌రలో తేడా ఎక్కువ‌గానే ఉన్న‌ప్ప‌టికీ ఐఫోన్ 16లోనూ బెస్ట్ కెమెరా, మంచి డిస్ ప్లే మ‌రియు అద్భుతమైన ప‌నితీరు ఉన్నాయి. అయితే ఏది తీసుకోవాలి అనుకున్నా సేల్ లో తీసుకోవ‌డం వ‌ల్ల లాభం పొంద‌వ‌చ్చు. త‌ర‌వాత వీటి ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంది.

Next Story