Samsung Galaxy Z Fold 6పై భారీ డిస్కౌంట్.. ఏకంగా 65వేలు తగ్గిన ఫోన్ ధర

by Ajay Maddhiboyina |

దీపావ‌ళి సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ (flipkart), అమెజాన్‌(amazon) లో మళ్లీ సేల్ మొదలైంది. సేల్‌లో చాలా ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే Samsung Galaxy Z Fold 6పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.

Samsung Galaxy Z Fold 6పై భారీ డిస్కౌంట్.. ఏకంగా 65వేలు తగ్గిన ఫోన్ ధర
X

దిశ, వెబ్ డెస్క్: దీపావ‌ళి సంద‌ర్భంగా ఫ్లిప్‌కార్ట్ (flipkart), అమెజాన్‌(amazon) లో మళ్లీ సేల్ మొదలైంది. సేల్‌లో చాలా ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే Samsung Galaxy Z Fold 6పై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. పవర్ ఫుల్ కెమెరా, మంచి ప్రాసెసర్‌తో అధిక ధరకు లాంచ్ అయిన ఈ ఫోన్ చాలా తక్కువ ధరకే వస్తుండటం విశేషం. ఈ ఫోన్ 12జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ లాంచింగ్ ధర రూ. 1,64,999 కాగా ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 1,03,999కే లభిస్తోంది. దీంతో పాటు అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వాడితే అదనంగా రూ.3,119 డిస్కౌంట్ లభిస్తుంది.

అంటే దాదాపు మీరు 65వేల తగ్గింపు ధరకు గెలాక్సీ జడ్ ఫోల్డ్౬ ని పొందవచ్చు. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. Qualcomm Snapdragon 8 Gen 3 processor ద్వారా ఇది పనిచేస్తుంది. ఇందులో Adreno 750 graphics processing unit సైతం ఉంది. అదేవిధంగా ఈ ఫోన్‌లో 6.3 ఇంచుల Dynamic LTPO AMOLED 2X డిస్ ప్లే ఉంది. ఫోన్ ప్యానల్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2తో రక్షించబడి ఉంది. ఇక ఇందులో 50MP+12MP+10MP ట్రిపుల్ కెమెరా ఉంది. అంతే కాకుండా 10MP ఫ్రంట్ కెమెరా ఉంది. వీటితో పాటు 4400mAh బ్యాట‌రీ 25 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో వ‌స్తుంది.

Next Story