బాలికల కోసం POCSO e-box.. అత్యాచార బాధితులకు చేయూతనిచ్చే యాప్

by Bhoopathi Nagaiah |

సె*క్స్ అంటే ఏంటో తెలియని పసి హృదయాలపై పాశావికంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు కామాంధులు

బాలికల కోసం POCSO e-box.. అత్యాచార బాధితులకు చేయూతనిచ్చే యాప్
X

దిశ, వెబ్‌డెస్క్ : చిన్నారులపై అత్యాచారాలు ప్రతి రోజు వెలుగు చూస్తూనే ఉన్నాయి. అసలు సె*క్స్ అంటే ఏంటో తెలియని పసి హృదయాలపై పాశావికంగా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. అసలు ఆ కామాంధుడు తనపై ఏం చేస్తున్నాడో తెలియని అమాయకత్వం వారిది. అయినా నిత్యం పసిపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదే ఆ పిల్లలకు జీవితంలో కోలుకోలేని షాకింగ్ ఘటన అయితే దర్యాప్తు పేరిట చేసే విచారణ మరో దారుణమనే చెప్పాలి. ఎంక్వైరీకి అక్కడికి రా, ఇక్కడికి రా అంటూ పోలీసులు తిప్పుతుంటారు. దీని వల్ల బాధితురాలి గోప్యత బహిర్గతం కావడంతోపాటు సమాజం దృష్టిలో పడుతుంది. ఇకపై వీటిన్నీటికి చెక్ పెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాచార బాధితురాలు ఇంటి నుంచే పోలీసులకు ఫిర్యాదు చేయడంతోపాటు కేసు అప్ డేట్‌ను కూడా తెలుసుకుకేలా యాప్‌ను తీసుకువచ్చింది.

ఏంటి ఈ POCSO e-box

POCSO e-box యాప్ ముఖ్య ఉద్దేశ్యం అత్యాచార బాధిత బాలికలకు సులభతర సేవలు అందించడమే. అత్యాచారం జరిగితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి పోక్స్ ఈ-బాక్స్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోని దానిలో ఫిర్యాదు చేయవచ్చు. బాధితుల వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు నేరస్తులకు శిక్ష పడే వరకు ఈ యాప్ సేవలు అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ యాప్‌ను జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఈ యాప్‌లో వచ్చిన ప్రతి ఫిర్యాదును ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందాలు పర్యవేక్షిస్తూ ఆ వివరాలను రాష్ట్ర, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులకు పంపిస్తారు. కేసు విచారణలోనూ ఈ యాప్ కీలకంగా వ్యవహరిస్తుంది. బాధిత బాలికలకు ప్రత్యేక రక్షణను ఏర్పాటు చేస్తారు. వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచేందుకు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ పర్యవేక్షణ చేస్తుంది.

ఫిర్యాదు ఎలా చేయాలి..?

పోక్స్ ఈ-బాక్స్ యాప్‌లో ఫిర్యాదు చేయడం చాలా సులభం. ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈ యాప్‌ను ఫోన్‌లో డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్ చేశాక రెడ్ కలర్ POCSO పేరుతో ఉన్న ఆఫ్షన్‌ని క్లిక్‌ చేయాలి. అందులో ప్లేగ్రౌండ్‌/షాప్‌/రోడ్‌/స్కూల్, ట్యూషన్, బ్లాక్‌మెయిల్‌, స్కూల్‌ బస్సు/వ్యాను/ఫ్యామిలీ మెంబరు/రిలేటివ్‌/ ఇతరులు, ఇంటర్నెట్‌/ఫోను ఇలా 6 అంశాలు ఫొటోలతో కనిపిస్తాయి. ఘటనకు సంబంధించిన చిత్రంపై క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత పేరు, మెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబరు నమోదు చేసిన తర్వాత ఆయా ఘటన వివరాలు పొందుపర్చాలి. అంతే మీ ఫిర్యాదు యాప్‌లో నమోదు అవుతుంది.

Next Story