iPhone 16 Pro: రూ.19వేల తగ్గింపు, 20 నిమిషాల్లోనే డెలివరీ.. ఐఫోన్ 16 ప్రోపై అదిరిపోయే ఆఫర్

by Ajay Maddhiboyina |

ఇటీవల మార్కెట్‌లోకి ఐఫోన్ 17 సిరీస్ ఎంట్రీ ఇవ్వడంతో ఐఫోన్ 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 16 ప్రోపై ఏకంగా రూ.19,000 డిస్కౌంట్ లభిస్తోంది.

iPhone 16 Pro: రూ.19వేల తగ్గింపు, 20 నిమిషాల్లోనే డెలివరీ.. ఐఫోన్ 16 ప్రోపై అదిరిపోయే ఆఫర్
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల మార్కెట్‌లోకి ఐఫోన్ 17 సిరీస్ ఎంట్రీ ఇవ్వడంతో ఐఫోన్ 16 సిరీస్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్లు దర్శనం ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 16 ప్రోపై ఏకంగా రూ.19,000 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.1,19,900 కాగా ప్రస్తుతం బిగ్ బాస్కెట్‌లో రూ.19,910 డిస్కౌంట్ పొందవచ్చు. దీంతో పాటు బిగ్ బాస్కెట్ లో ఐఫోన్ 16 ప్రో పై ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా ఉంది. కాబట్టి మీ పాత ఫోన్ ఎక్స్ చేంజ్ చేస్తే మరింత డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది.

అంతే కాకుండా కేవలం 20 నిమిషాల్లోనే ఫోన్ మీ ఇంటికి వచ్చేస్తుంది. అంటే ఫోన్ కోసం వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక ఈ ఫోన్ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్ల విష‌యానికి వస్తే... iPhone 16 Pro టైటానియం ఫ్రేమ్, గ్లాస్ తో ముందు, వెన‌క భాగంలో ప్రొటెక్ష‌న్ ఇవ్వ‌డంతో నీరు, దూళిని నిరోదిస్తుంది. పూర్తి వాట‌ర్ రెస్టిస్టెంట్ గా ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. ఈ ఫోన్ లో 6.3 అంగుళాల LTPO సూపర్ రెటినా XDR OLED డిస్ ప్లేను క‌లిగి ఉంది. 120Hz రీఫ్రెష్ రేటుతో ఇది పనిచేస్తుంది. అదే విధంగా ఇందులో 128 GB ఇంట‌ర్న‌ల్ మెమోరీ వ‌స్తుంది.

Apple A18 Pro Chip, Hexa Core ద్వారా ఈ ఫోన్ ప‌నిచేస్తుంది. అంతే కాకుండా ఈ ఫోన్ లో 48 MP + 48 MP + 12MP ట్రిపుల్ కెమెరా ఉండ‌టంతో ఫోటోలు దాదాపు ప్రొఫెష‌న‌ల్ కెమెరా రేంజ్ లో వ‌స్తాయి. అదే విధంగా 12 మెగాపిక్స‌ల్ ఫ్రంట్ కెమెరా ఇందులో ఉంది. ఇందులో కెమెరా కంట్రోల్, ప్రో మోష‌న్ టెక్నాల‌జీ లాంటి అధునాత ఫీచ‌ర్స్ ఉన్నాయి. చాలా మంది ఈ ఫోన్ కొనాల‌ని ధ‌ర ఎక్కువ కావ‌డం వ‌ల్ల కొన‌లేకపోయారు. అలాంటి వాళ్లు దీనిని సొంతం చేసుకోవ‌డానికి ఇది మంచి స‌మ‌యం అనే చెప్పాలి.

Next Story