- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Best ACs: ఎండాకాలం వస్తోంది.. ఏసీ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? రూ. 30వేలలో బెస్ట్ ఏసీలు ఇవే
Best ACs: వచ్చేది ఎండాకాలం. మార్చి నెల వచ్చిందంటే చాలు ఎండ భగ్గుమంటాయి. వాతావరణంలో కూడా కొద్దికొద్ది మార్పులు మొదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: Best ACs: వచ్చేది ఎండాకాలం. మార్చి నెల వచ్చిందంటే చాలు ఎండ భగ్గుమంటాయి. వాతావరణంలో కూడా కొద్దికొద్ది మార్పులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎండవేడిమిని తట్టుకునేందుకు కూలర్లు, ఏసీలను కొనాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే మీరు కూడా ఏసీ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లయితే రూ. 30వేల బడ్జెట్ లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఏసీలు, వాటి ఫీచర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అయితే ఏసీ అనగానే చాలా మందికి కనీసం 50వేలు అయినా పెట్టాల్సిందే అనుకుంటారు. అయితే ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ప్రస్తుతం ఏసీలపై మంచి డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. దీంతో రూ. 30వేల లోపు కూడా ఏసీలు అందుబాటులోకి ఉన్నాయి. అలాంటి కొన్ని బెస్ట్ ఏసీలు వాటిలో ఉన్న ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుకుందాం.
Carrier 1 Ton 3 Star: ఈ ఏసీ ధర రూ. 56,900. కానీ అమెజాన్ లో 45శాతం డిస్కౌంట్ తో రూ. 31,490కి అందుబాటులో ఉంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసినట్లయితే అదనంగా డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
Carrier 1 Ton 3 Star: రూ. 30వేలలోపు అందుబాటులో ఉన్న మరో బెస్ట్ ఏసీల్లో ఇదీ కూడా ఒకటి. ఈ ఏసీ అసలు ధర రూ. 47, 900కాగా 39 శాతం డిస్కౌంట్ తో రూ. 28, 900కి లభిస్తోంది.
Godrej 1 Ton: ఈ ఏసీ అసలు ధర రూ. 42,990. అమెజాన్ లో 33శాతం డిస్కౌంట్ తో రూ. 28, 900కే లభిస్తోంది. ఇందులో 5ఇన్ వన్ కన్వర్టబుల్ కూలింగ్ టెక్నాలజీని కూడా అందించారు.
Hisense 1.5 Ton: 1.5 టన్ కెపాసిటీతో తీసుకువచ్చిన ఈ ఏసీపై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఈ ఏసీ అసలు ధర రూ. 48,999. 39శాతం డిస్కౌంట్ తో రూ. 29,900కి అందుబాటులో ఉంది. ఇందులో 4మోడ్స్ ఇంటెలిజెంట్ తో కూడిన 4 ఇన్ వన్ కన్వర్టబుల్ ను అందించారు. 4.85 కిలో వాట్స్ కూలింగ్ పవర్ ఈ ఏసీ ఉంటుంది. స్లీప్ మోడ్, సెల్ఫ్ క్లీన్, క్విక్ చిల్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
Panasonic 1 Ton 3 Star: పానసోనిక్ 1 టన్ 3 స్టార్ ఏసీ అసలు ధర రూ. 48,100ఉంది. అమెజాన్ లో 33శాతం డిస్కౌంట్ తో రూ. 31, 990కి లభిస్తోంది. పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేసినట్లయితే చేస్తే అదనంగా మరింత డిస్కౌంట్ లభిస్తుంది. ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఏసీ వైఫై ఇన్వర్టర్ స్మార్ట్ స్లిట్ టెక్నాలజీతో పనిచేస్తుంది. 7 ఇన్ వన్ కన్వర్టబుల్ ట్రూ ఏఐ టెక్నాలజీని అందించారు. అలెక్సా, ఓకే గూగుల్ వంటి వాయిస్ కమాండ్స్ తో ఈ ఏసీ పనిచేస్తుంది.






