- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Whatsapp: వాట్సప్‌లో వచ్చే మీమ్స్, ఫొటోస్ నీ చూసి మోసపోవద్దు.. క్లిక్ చేస్తే డబ్బులు ఫసక్..!!
Whatsapp: దేశంలో సాంకేతికతో సైబర్ మోసాల ముప్పు పెరిగింది.

దిశ, వెబ్ డెస్క్: Whatsapp: దేశంలో సాంకేతికతో సైబర్ మోసాల ముప్పు పెరిగింది. సైబర్ నేరగాళ్లు కొత్తమార్గాలను ఎంచుకుంటున్నారు. కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా మీరు మోసానికి గురయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో వాట్సాప్ లో ఫన్నీ మీమ్స్, ఆఫర్స్ లేదా ఫొటోలు పంపించడం ద్వారా మోసం చేసేందుకు కొత్త పద్ధతి అవలంబిస్తున్నారు. తెలియని నెంబర్ మీకు ఒక ఫొటోను వస్తుంది. ఈ ఫొటో సాధారణంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఇందులో ఫన్నీ మీమ్స్, రూ. 5000 గెలుచుకోండి వంటి ఆఫర్లు లేదా ఏదైనా ఆకర్షణీయమైన మెసేజ్ లు ఉంటాయి. కానీ ఇందులో ఒక ప్రమాదం ఉంది. మీరు దీన్ని డౌన్ లోడ్ చేసుకుంటే చిత్రంలో దాగి ఉన్న వైరస్ లేదా స్పైవేర్ మీ ఫోన్ లో రహస్యంగా ఇన్ స్టాల్ అయిపోతుంది.
ఈ వైరస్ మీ ఫొటోలు, మెసేజ్ లు, కాంటాక్టులు, బ్యాంకింగ్ యాప్స్ యాక్సెస్ చేస్తుంది.కొన్ని ఫొటోలలో క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇది మిమ్మల్ని ఒక ఫేక్ వెబ్ సైట్ కు తీసుకెళ్తుంది. వైరస్ లేదా రాన్సమ్ వేర్ ను అక్కడి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇది మీ ఫోన్ నుంచి మొత్తం డేటాను దొంగిలించగలదు. ఈ వైరస్ మీ ఫోన్ వర్చువల్ కీబోర్డులో టైప్ చేసిన పాస్ వర్డ్ లను అంటే బ్యాంక్ పిన్స్ లేదా సోషల్ మీడియా లాగిన్స్ ను కూడా చూస్తుంది. ఈ విధంగా హ్యాకర్లు మీ బ్యాంక్ అకౌంట్, సోషల్ మీడియా, పర్సనల్ సమాచారాన్ని దొంగిలించవచ్చు.
ఎందుకంటే ఈ స్కామ్ చాలా డేంజర్. మీకు తెలియకుండానే దాన్నిస్ప్రెడ్ చేస్తారు. మీ స్నేహితుడి నుంచి ఈ ఫన్నీ ఇమేజ్ లు అందుకుని మీరు దాన్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ కు ఫార్వర్డ్ చేస్తే..అప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ కు పంపిస్తారు. ఇలా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది. దీన్నే స్టెగనోగ్రఫీ అంటారు. మీకు తెలియని యాప్స్ ను డిలీట్ చేయండి. వాట్సాప్ లో ఆ నెంబర్ ను బ్లాక్ చేసి cybercrime.gov.in కంప్లెయింట్ చేయండి.






