Apple TV: ఆండ్రాయిడ్ యూజర్లకు యాపిల్ సంస్థ గుడ్ న్యూస్.. ఏంటంటే?

by Yella Dhawani Reddy |

Apple TV: ఆండ్రాయిడ్ యూజర్లకు యాపిల్ సంస్థ గుడ్ న్యూస్.. ఏంటంటే?
X

దిశ, వెబ్ డెస్క్: ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ (Apple) సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది. iOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్న యాపిల్ టీవీ ప్లస్(Apple TV +) సేవల్ని ఎట్టకేలకు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారంలో లాంచ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఫోల్డబుల్ మొబైల్స్‌లోనూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని యాపిల్ టీవీ ప్లస్ సర్వీసును ఎంజాయ్ చేయొచ్చని కంపెనీ తెలిపింది. గూగుల్‌ ప్లే అకౌంట్‌ ద్వారా యాపిల్ టీవీ+, ఎంఎల్‌ఎస్‌ సీజన్‌ పాస్‌లను వినియోగించుకోవచ్చని వెల్లడించింది.

ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే, ఈ యాప్ అన్ని ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు సపోర్ట్‌ చేయదు. ఆండ్రాయిడ్‌ 11, అంతకంటే ఎక్కువ వెర్షన్‌తో నడుస్తున్న ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు మాత్రమే యాపిల్ టీవీ ప్లస్ సపోర్ట్‌ చేస్తుందని యాపిల్‌ సంస్థ స్పష్టం చేసింది. యూజర్లను ఆకర్షించేందుకు ఈ యాప్ ఏడు రోజుల ఫ్రీ ట్రయల్‌ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఐక్లౌడ్ ఖాతా ఉన్న వినియోగదారులు ఆండ్రాయిడ్‌ డివైజుల్లో తమ ఐక్లౌడ్ ఐడీని ఉపయోగించి లాగిన్‌ అవ్వొచ్చు. వాచ్‌లిస్ట్‌, కంటిన్యూ వాచింగ్‌, ఆఫ్‌లైన్ కంటెంట్.. లాంటి ఫీచర్లు యాపిల్‌ టీవీ యాప్‌లో ఉన్నాయి.

ఇక ఇండియాలో ఆండ్రాయిడ్ యూజర్లకు యాపిల్ టీవీ ప్లస్ ఒక నెల సబ్‌స్క్రిప్షన్‌కు ధర రూ.99గా ఉంది. కొత్తగా ఐఫోన్, ఐపాడ్ లేదా మ్యాక్ వంటి యాపిల్ డివైజ్‌లు కొనుగోలు చేసే యూజర్లకు కంపెనీ మూడు నెలల పాటు యాపిల్ టీవీ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తోంది. ఇవే కాకుండా, సబ్‌స్క్రిప్షన్‌ను ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. ఒక సబ్‌స్క్రిప్షన్‌తో ఐదుగురు కుటుంబ సభ్యులు వరకు ఈ స్ట్రీమింగ్ యాప్ సేవలను వాడుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులోకి రావటంతో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారంలు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Next Story