2024లో ‘యాపిల్’ లవర్స్‌కు పండగే.. అదిరిపోయే ప్రొడక్ట్స్

by Swamyn |
2024లో ‘యాపిల్’ లవర్స్‌కు పండగే.. అదిరిపోయే ప్రొడక్ట్స్
X

దిశ,టెక్నాలజీ: 2024లో ‘యాపిల్’ ప్రొడక్ట్స్‌ను ఇష్టపడేవారికి పండగే అని చెప్పాలి. ఈ ఏడాదిలో ‘ఐఫోన్-16’తోపాటు మరెన్నో అదిరిపోయే యాపిల్ ప్రొడక్ట్స్‌ మార్కెట్లోకి రిలీజ్ కానున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.





ఐఫోన్-16

ఎప్పటిలానే ఈ ఏడాదిలోనూ ‘యాపిల్’ యూజర్లందరూ ఎక్కువగా ఎదురుచూసేవాటిల్లో ఐఫోన్-16 ముందు వరుసలో ఉంటుంది. ఇది కాదనలేని నిజం. ఐఫోన్-16 మొబైల్‌ను సెప్టెంబర్‌లో తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఐఫోన్-15తో పోలిస్తే, ఐఫోన్-16 భారీ మార్పులతో రాబోతుందని తెలుస్తోంది. సరికొత్త డిజైన్‌తోపాటు మరిన్ని ఫీచర్స్‌తో తీసుకురానున్నారని టాక్. సంబంధిత వర్గాల నుంచి వెలువడుతున్న ఊహాగానాల ప్రకారం, 16 ప్రో మోడల్‌లో కెమెరాను తక్షణమే ఓపెన్ చేయడానికి వీలుగా ‘క్యాప్చర్’ బటన్ ఇవ్వనున్నారు. అలాగే, ‘జూమ్’ సామర్థ్యాన్ని మరింత పెంచనున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, కొత్తగా ‘ఐఫోన్ 16 అల్ట్రా’ను తీసుకురాబోతున్నారు. కెమెరా, బ్యాటరీ సామర్థ్యాలను మరింత పెంచనున్నారు.





ఎం3 చిప్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్

సరికొత్త ఎం3 చిప్‌తో ‘మ్యాక్‌బుక్ ఎయిర్’ ల్యాప్‌టాప్‌లను సైతం ఈ ఏడాదిలో యాపిల్ సంస్థ విడుదల చేయనుంది. 2023లో వచ్చిన 15-ఇంచ్ ‘మ్యాక్‌బుక్ ఎయిర్‌’ ఎం2 చిప్‌తో వచ్చిన విషయం తెలిసిందే. కొత్త ఏడాదిలో తీసుకురానున్న మోడల్‌‌ను మాత్రం అడ్వాన్స్‌డ్ ఎం3 చిప్‌‌తో తీసుకురానుంది.





ఐప్యాడ్ ప్రో

ఈ ఏడాదిలోనూ ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ ప్రో ఉత్పత్తులను తీసుకురానుంది. అయితే, ఈసారి రానున్న ఐప్యాడ్ ప్రో.. ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రానుండటం విశేషం. దీంతోపాటు యాపిల్ వాచ్ ఎక్స్ సైతం మరిన్ని అడ్వాన్స్‌ ఫీచర్స్‌తో రానున్నట్టు తెలుస్తోంది.


Advertisement

Next Story