విద్యార్థుల కోసం ఆహార నాణ్యత కొలిచే AI మెషిన్‌ను ఏర్పాటు చేసిన కలెక్టర్

by Disha Web Desk 17 |
విద్యార్థుల కోసం ఆహార నాణ్యత కొలిచే AI మెషిన్‌ను ఏర్పాటు చేసిన కలెక్టర్
X

దిశ, వెబ్‌డెస్క్: తినే ఆహారంలో ఎన్ని పోషకాలు ఉన్నాయి, దాని నాణ్యత ఎలా ఉంది అని తెలియజేసే ఆర్టిఫిషియల్-ఇంటెలిజెన్స్ ఆధారిత యంత్రాన్ని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో, ఎటపల్లిలోని తోడ్సా గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ మెషిన్ ముందు ఆహారం ఉన్న ప్లేట్‌తో నిలబడితే, అది నిలబడిన వారిని, ప్లేట్‌లో ఉన్న ఆహరాన్ని ఫొటో తీసి కొన్ని సెకన్లలో, ఎటువంటి మానవ ప్రమేయం లేకుండా, ఆహారం నాణ్యత బాగుందో లేదో గుర్తిస్తుంది. పోషకాహార లోపంతో బాధపడుతున్న వారికి ఎంత ఆహారం, ఎలాంటి నాణ్యతతో ఇవ్వాలో ఈ మెషిన్ చూపిస్తుంది.

గిరిజన ఆశ్రమ పాఠశాలలో ప్రతి రోజు విద్యార్థులకు మూడు పూటల(అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం) ఆహారాన్ని అందిస్తున్న కూడా చాలా మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. నివేదిక ప్రకారం, 222 మందిలో 61 మంది బాలికలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అండ్ అసిస్టెంట్ కలెక్టర్ శుభం గుప్తా, NGO సహాయంతో పాఠశాలలో ఆహార నాణ్యతను కొలిచే AI మెషిన్‌ను ప్రవేశపెట్టారు. దీనిలో వచ్చిన డేటా ఆధారంగా విద్యార్థులకు మరింత మెరుగైన ఆహారాన్ని అందిస్తున్నట్లు అసిస్టెంట్ కలెక్టర్ తెలిపారు.


ఆయన మాట్లాడుతూ.. దీనిని సెప్టెంబర్ 2022లో ఇన్‌స్టాల్ చేశాము. అప్పటి నుండి ఆహార నాణ్యత మెరుగుపడింది. అలాగే, మంచి పోషకాహారం కలిగిన ఆహారాన్ని అందించడానికి, ఏమి తినాలి, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఎలా జీవించాలి అనే దాని గురించి నిర్ణయాలు తీసుకోవడంలో AI సహాయపడుతుంది అని అన్నారు.

Next Story

Most Viewed