BSNL కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్

by velandi.Saikiran |

కేవలం రూ.599లతో రీఛార్జ్ చేస్తే, 70 రోజుల వ్యాలిడిటీ వచ్చేలా ఆఫర్ ప్రకటించింది BSNL.

BSNL కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్
X

దిశ‌, వెబ్ డెస్క్: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL కస్టమర్ల కోసం అదిరిపోయే ప్లాన్ ప్రకటించింది. కేవలం రూ.599లతో రీఛార్జ్ చేస్తే, 70 రోజుల వ్యాలిడిటీ వచ్చేలా ఆఫర్ ప్రకటించింది. ఇందులో ప్రతి రోజుకు 3GB హై స్పీడ్ డేటా అందించ‌నుంది BSNL. దానికి తోడు అన్ లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 మెసేజులు పంపించుకోవచ్చు. దీంతో కస్టమర్లకు భారీ ఊరట లభించనుంది.

ప్రైవేట్ నెట్వర్కులు అయిన జియో, ఎయిర్ టెల్ యూజర్స్ ఇదే తరహా బెనిఫిట్స్ కోసం దాదాపు డబుల్ ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ BSNL మాత్రం కేవలం 599 రూపాయలకే ఆఫర్ అందిస్తోంది. బడ్జెట్ ధరలో ఎక్కువ డేటా కోరుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్ అని విశ్లేషకులు చెబుతున్నారు.

BSNL ఆఫర్ వివరాలు

రూ. 599లతో రీఛార్జ్ చేస్తే 70 రోజుల పాటు కాల పరిమితి ఉంటుంది. రోజుకు 3జీబీ చొప్పున 210 జీబీ అందిస్తున్నారు. అన్లిమిటెడ్ కాల్స్ అందిస్తూనే మరో ఆఫర్ కూడా ఇచ్చింది BSNL. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు అన్ లిమిటెడ్ ఉచిత డేటాను కూడా వాడుకోవచ్చు. జింగ్, PRBT, ఆస్ట్రోటల్ లాంటి యాప్స్ సబ్స్క్రిప్షన్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.

Next Story