- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
5000 బ్యాటరీతో 6 వేలకే అదిరిపోయే ఫోన్..ఫీచర్స్ ఇవే
AI+ పల్స్ ( AI+ Pulse) ఒకటి. 6.74 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ కు మంచి రేటింగ్ ఉంది. ఆన్లైన్ లో కొనుగో

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ మార్కెట్లోకి అనేక రకాల మొబైల్ ఫోన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం 5G కాలం నడుస్తున్న నేపథ్యంలో...4G మొబైల్ ఫోన్స్ పక్కకు పెట్టి, 5G ఫోన్స్ కొనుగోలు చేస్తున్నారు జనాలు. అయినప్పటికీ 4G లోనే అదిరిపోయే మొబైల్ ఫోన్స్ కూడా మార్కెట్లో లభిస్తున్నాయి. అంతేకాదు సామాన్యులు కొనుగోలు చేసేలా, ఆరువేల రూపాయల లోపే ఈ ఫోన్స్ వస్తున్నాయి.
అందులో AI+ పల్స్ ( AI+ Pulse) ఒకటి. 6.74 అంగుళాల డిస్ప్లే కలిగి ఉన్న ఈ మొబైల్ కు మంచి రేటింగ్ ఉంది. ఆన్లైన్ లో కొనుగోలు చేస్తే రూ.5,499 ఈ మొబైల్ వస్తుంది. 50 ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీ కోసం 5 ఎంపీ కెమెరా అందిస్తున్నారు. బ్యాటరీ 5000 mah సామర్థ్యం ఉంటుంది. ఆండ్రాయిడ్ 15 వెర్షన్ పై ఈ మొబైల్ నడుస్తుంది. 4GB RAM/64GB స్టోరేజ్ మొబైల్ ఫోన్ 5499 రూపాయలకు వస్తుండగా 6జిబి RAM /128gb స్టోరేజ్ ఉన్న మరో మోడల్ మొబైల్ 7 వేల రూపాయలకు వస్తోంది.






