ఇంట్లోనే ఈజీగా షుగర్ టెస్ట్.. కొత్త పరికరం కనిపెట్టిన తెలుగు శాస్త్రవేత్త

by Disha Web Desk 2 |
ఇంట్లోనే ఈజీగా షుగర్ టెస్ట్.. కొత్త పరికరం కనిపెట్టిన తెలుగు శాస్త్రవేత్త
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా అందరూ షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. కొందరు ఈ వ్యాధిని వెంటనే గుర్తించి సరైన జాగ్రత్తలు తీసుకుంటుండగా.. మరికొందరు నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా.. మధుమేహంతో బాధపడుతున్న వారికి ఉపశమనం కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రికి వెళ్లకుండా, సూది గుచ్చకుండా ఇంటివద్దే షుగర్ టెస్టు చేసుకునేలా ఏపీకి చెందిన వూసా చిరంజీవి శ్రీనివాసరావు అనే శాస్త్రవేత్త కొత్త పరికరం కనిపెట్టారు. చెమటను పరీక్షించి రక్తంలో షుగర్ స్థాయిలను చెప్పే కొత్త పరికరాన్ని చిరంజీవి కనుగొన్నారు.

ఆయనకు ఇటీవల కేంద్రం ఈ పరికరంపై పేటెంట్ హక్కులు జారీ చేసింది. సూది అవసరం లేకుండానే ఈ పరికరంతో గ్లూకోజ్ పరీక్షలు చేయవచ్చు. ఫలితంగా ఈ పరికరం చిన్నారులకు, పలుమార్లు షుగర్ టెస్ట్ అవసరమైన వారికి ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు. తాను రూపొందించిన పరికరాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పలు విధాలుగా పరీక్షించి తాజాగా పేటెంట్ హక్కులు జారీ చేసిందని వెల్లడించారు. ఈ పరికరాన్ని రూపొందించేందుకు తానకు నాలుగేళ్లు పట్టిందని అన్నారు. ఇది మార్కెట్‌లోకి వస్తే పేద, మధ్య తరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు.

Next Story

Most Viewed