స‌రికొత్త ఆవిష్క‌ర‌ణః శ‌రీరంలో ఎక్క‌డికైన దూర‌గ‌లిగే మ్యాగ్న‌టిక్ 'సాఫ్ట్ రోబో' (వీడియో)

by Disha Web Desk 20 |
స‌రికొత్త ఆవిష్క‌ర‌ణః శ‌రీరంలో ఎక్క‌డికైన దూర‌గ‌లిగే మ్యాగ్న‌టిక్ సాఫ్ట్ రోబో (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః సైన్స్ అండ్ టెక్నాల‌జీలో వ‌స్తున్న స‌రికొత్త ఆవిష్క‌ర‌ణ‌లు మ‌నిషిలో విజ్ఞానాన్ని మ‌రోస్థాయికి తీసుకెళ్తున్నాయి. అలాగే, ఎప్ప‌టిక‌ప్పుడు ఆయా అవ‌స‌రాల‌కు అనుగుణంగా అభివృద్ధి చేస్తున్న టెక్నాల‌జీతో ఎంత‌టి స‌మ‌స్య‌నైనా సులువుగా ప‌రిష్క‌రించే మార్గాలు క‌నిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా హాంగ్‌కాంగ్‌లోని చైనీస్ యూనివర్శిటీ పరిశోధకులు అయస్కాంత కణాలతో మొత్త‌టి మ‌ట్టిలాంటి "సాఫ్ట్ రోబోట్"ను రూపొందించారు. బాహ్య అయస్కాంతాలను ఉపయోగించి దిశ మార్చ‌గ‌లిగిన ఈ రోబో వైద్య ప‌రిక‌రంగానే కాక‌, ప‌లు విధాలుగా వినియోగించుకోవ‌చ్చు. వాస్త‌వానికి, అయస్కాంత కణాలు విషపూరితమైనవి అయిన‌ప్ప‌టికీ ఈ రోబోలోని సిలికాన్ సమ్మేళనంతో ఉన్న‌ పొరతో కప్పబడిన తర్వాత ఇది మానవ శరీరంలోకి ప్రవేశించడానికి అనుకూలంగా మారింది. అందుకే ఇది సిద్ధాంతపరంగా సురక్షితంగా రూపొందించ‌బ‌డిన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు. అయితే దీనిపై భవిష్యత్తులో మరింత భద్రతా పరీక్షలు చేయాల్సి ఉంద‌ని అన్నారు.

చిన్న‌పిల్ల‌లు, ఒక్కోసారి పెద్ద‌లు కూడా, ప్ర‌మాద‌వ‌శాత్తు వస్తువులను మింగేస్తే, వాటిని బ‌య‌ట‌కు తీయ‌డానికి ఈ బురదలాంటి సాగే రోబో ఉపయోగ‌ప‌డుతుంద‌ని హాంకాంగ్‌లోని శాస్త్ర‌వేత్త‌ల‌ బృందం ఆశిస్తున్నారు. ఈ రోబో వస్తువులను గ్రహించగలదు, విరిగిన సర్క్యూట్‌లనూ అతికించ‌గ‌ల‌దు. అయితే, ఇప్ప‌టికే సాగే రోబోట్‌లు, ఇరుకైన ప్రదేశాలను నావిగేట్ చేయగల ద్రవ-ఆధారిత రోబోట్‌లు ఉన్నాయి. కానీ, ఈ రెండు లక్షణాలు కలిపి ఉన్న‌ రోబోలు చాలా త‌క్కువ. ఈ గ్యాప్‌ని పూడుస్తూ చైనీస్ యూనివర్శిటీ ఆఫ్ హాంకాంగ్‌లోని లి జాంగ్, అతని సహచరులు దీన్ని త‌యారుచేశారు. బోరాక్స్‌తో నియోడైమియం మాగ్నెట్ కణాలను కలిపి, అలాగే, సాధారణ గృహ డిటర్జెంట్, పాలీ వినైల్ ఆల్కహాల్ అనే ఒక రకమైన రెసిన్‌తో కలిపి, నియంత్రించగలిగే బురదలాంటి ఈ రోబోను రూపొందించార

Next Story